అక్కినేని న‌వ మ‌న్మ‌థుడు అఖిల్ న‌టించిన మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ రెండున్న‌ర సంవ‌త్స రాలుగా ఊరి స్తూ ఊరిస్తూ వ‌చ్చి ఎట్ట‌కేల‌కు ఈ ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అటు గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో పాటు ఇటు సౌత్ ఇండియాను త‌న అంద చందాల‌తో ఊపేస్తోన్న పూజా హెగ్డే హీరోయిన్ కావ‌డం తో ఈ సినిమా రిలీజ్ కు ముందే మంచి అప్లాజ్ తెచ్చుకుంది.

పైగా కరోనా దెబ్బ తో రెండు సంవ‌త్స‌రాలుగా స‌రైన సినిమా లేక క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తోన్న ప్రేక్ష‌కుల కు మొన్న అక్కినేని నాగ‌చై త‌న్య ల‌వ్ స్టోరీ సినిమా తో పాటు ఇప్పుడు చైతు త‌మ్ముడు అఖిల్ న‌టించిన మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ రెండు సినిమాలు ఆక‌లి గా దొరికాయి. ఇక బ్యాచిల‌ర్ కు తొలి రోజు మరీ అంత మంచి టాక్ అయితే రాలేదు.

అయినా వ‌సూళ్ల ప‌రంగా మాత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ము రేపేస్తోంది. దసరాకు వచ్చిన మూడు   సినిమా ల్లో దేనికీ పూర్తి పాజిటివ్ టాక్ రాక‌పోవ‌డం కూడా ఈ సినిమాకు ప్ల‌స్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే బ్యాచిల‌ర్ కు తొలి రెండు రోజుల్లో వచ్చిన వసూళ్లు అందరినీ షాక్ కు గురి చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల‌కు బ్యాచిల‌ర్ సినిమా దాదాపు రూ.18 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

విచిత్రం ఏంటంటే మిక్స్ డ్ టాక్ ఉన్నా కూడా యూఎస్ లో  ఇప్ప‌టి వ ర‌కు  3.5 లక్షల డాలర్లు కొల్లగొట్టడం విశేషం. ఈ సినిమా ఫుల్ ర‌న్ లో అక్క‌డ హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ ను సులువుగా క్రాస్ చేస్తుంద‌ని అంటున్నారు. ఇక పెళ్లిసంద‌D - మ‌హాస‌ముద్రం ప్లాప్ అవ్వ‌డం కూడా బ్యాచిల‌ర్ కు బాగా ప్ల‌స్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: