సోషల్ మీడియా వాడకం లోకి వచ్చాక సినీ సెలెబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా ఇట్టే తెలిసిపోతోంది.సెలెబ్రిటీలు ధరించే డ్రెస్సుల నుంచి వారు వేసుకునే చెప్పులు,వాచీలు, గాగుల్స్..ఇలా ప్రతీ ఒక్కటి అభిమానులకు పెద్ద విషయమే.వాళ్ళు ఏ లుక్ లో కనిపించినా కెమెరా కళ్ళు క్లిక్కుమంటాయి.అలా తీసిన ఫోటోల్లో చిన్న విశేషం కనిపించినా సోషల్ మీడియాలో అదో పెద్ద వార్తగా మారుతుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా బాలీవుడ్ భామ నోరా పతేహి విషయంలో కూడా ఇదే జరిగింది.ఈ బాలీవుడ్ బ్యూటీ మన టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే.ఈ భామ తెలుగులో ఎన్టీఆర్ టెంపర్,రవితేజ కిక్2,ఊపిరి వంటి సినిమాల్లో ఆడిపాడింది.

అంతేకాదు మన పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో 'మనోహరి' పాటలోనూ కనిపించి కుర్రకారు మదిని దోచుకుంది.ఇక తాజాగా ఈ భామ 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో 'ఈడీ' ఎదుట హాజరైంది.ఆ సమయంలో కొన్ని లక్షల రూపాయల విలువ గల హ్యాండ్ బ్యాగ్ ను ధరించి అభిమానులకు దర్శనమిచ్చింది.బ్లూ కలర్ టీ షర్ట్,షార్ట్స్ వేసుకొని వచ్చిన నోరా ఫతేహి చేతిలో హ్యాండ్ బ్యాగ్ తో కనిపించింది.ప్రస్తుతం ఈ భామ హ్యాండ్ బ్యాగ్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.దానికి కారణం ఆ హ్యాండ్ బ్యాగ్ ధర.దీని విలువ సుమారు రూ.1.95 లక్షలు కాగా..మినీ లూయిస్ విట్టన్ పామ్ స్ప్రింగ్స్ అనే బ్రాండ్ కి చెందింది ఆ హ్యాండ్ బ్యాగ్.

దీంతో ఆ బ్యాగ్ ధర తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు.ఇక ఆమె హ్యాండ్ బ్యాగ్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.ఇక గతంలో ఈ హీరోయిన్ తో పాటు బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ చాలామంది కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ ని వాడటం జరిగింది. ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే, ఆలియా భట్ లాంటి అగ్ర హీరోయిన్లు కొన్ని లక్షలు విలువ చేసే హ్యాండ్ బ్యాగ్స్ ని వాడారు.ఇప్పుడు ఆ లిస్టులో నోరా హాతేహి కూడా చచేరిపోయింది.ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు తెలుగులో కూడా ఐటమ్ సాంగ్స్ కి గానూ ఈ భామనే పరిశీలిస్తున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: