మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో ప్రకాష్ రాజ్ ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికలు పూర్తయిన సరే ప్రకాష్ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అదే విధంగా కొంతమంది ఆయన పై వ్యాఖ్యలు చేయడం ఆయన కొంత మంది పై వ్యాఖ్యలు చేయడం వంటివి జరుగుతూ వస్తున్నాయి. ప్రకాష్ రాజ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం టాలీవుడ్ వర్గాల్లో బాగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రకాష్ రాజు విషయం లో టాలీవుడ్ ఆలోచన ఏ విధంగా ఉంది ఏంటి అనే దానిపై ఇప్పుడు కాస్త ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

అయితే ప్రకాష్ రాజ్ ఇప్పుడు తెలుగు సినిమా కు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తెలుగు సినిమా విషయంలో ఆయన చాలా ఇబ్బందులు పడుతున్నారని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో ఆయన కొంతమందితో వివాదాలు పెట్టుకోవడం ఆయనకు తెలుగులో అవకాశాలు రాకుండా చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. రాజకీయంగా కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సంచలనంగా మారడంతో ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఎటువంటి అడుగులు వేయబోతున్నారు ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి.

అయితే ఆయన తెలుగు సినిమాకు దాదాపుగా గుడ్ బై చెప్పే అవకాశం ఉందని భవిష్యత్తులో తనకు మరిన్ని కష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే ఆలోచనలో ఆయన ఉన్నారని అందుకే ఇప్పటికే తాను చేస్తున్న సినిమా దర్శకులకు కూడా చెప్పేశారు అని అంటున్నారు.  వచ్చే ఏడాది నుంచి తెలుగులో సినిమాలు చేసే ఆలోచన లేదని కాబట్టి తనతో ఎవరూ సంప్రదింపులు జరపడానికి కూడా వద్దని చెప్పారు అని తనతో సినిమా చేయాలని అనుకున్న కొంతమందితో కూడా ప్రకాష్ రాజ్ స్పష్టం గా చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై ప్రకాష్ రాజు నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఇది కేవలం గాసిప్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: