మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఏమో గాని ఎన్నికల విషయంలో సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు జోక్యం చేసుకున్న విధానం చాలా మందికి నచ్చలేదు. ప్రధానంగా ప్రకాష్ రాజు విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అలాగే ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు బాగా సంచలనం అయ్యాయి. తాజాగా కోట శ్రీనివాసరావు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో కుల ప్రభావం ఉందా అని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించిన విధానం బాగా హైలెట్ అయ్యింది.

కచ్చితంగా ఎన్నికల్లో కుల ప్రభావం పని చేసిందని... తాను గత నలభై ఏళ్ల నుంచి ఒక కులానికి సంబంధించిన ఫుడ్   తింటున్నానని కాబట్టి ఆ కులం అంటే తనకు గౌరవం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ కులాన్ని తాను వ్యక్తిగతంగా గౌరవిస్తానని చెబుతూ చివర్లో కులం పేరు కూడా ఆయన బయట పెట్టారు. ఈ సందర్భంగా 95% తన కెరీర్ కు ఆ కులం మాత్రమే సహకరించిందని మిగిలిన 5% వేరే కులాలు సహకరించాయని చెప్పారు.

అయితే ఇప్పుడు కోటా శ్రీనివాస రావు అని కొంతమంది టాలీవుడ్ పెద్దలు పక్కన పెట్టే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో కోట శ్రీనివాసరావు దాదాపుగా అందరి తో పని చేశారు. కానీ ఆయన కొంతమందికి వకాల్తా పుచ్చుకొని మాట్లాడటం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనితో మెగా ఫ్యామిలీ అలాగే మెగా ఫ్యామిలీ తో సన్నిహితంగా ఉండే వాళ్ళు కోట శ్రీనివాసరావు దాదాపుగా పక్కన పెట్టే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఇప్పటివరకు కూడా శ్రీనివాసరావుకి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకపోయినా భవిష్యత్తులో మాత్రం ఇబ్బందికర వాతావరణం రావచ్చు అనేది వినపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: