ఇప్పుడిప్పుడే కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు ఉత్సాహం చేస్తున్నారు. అలాగే ఇప్పటికి కూడా కొన్ని సినిమాలు నేరుగా ఓటిటి లలో విడుదల అవుతున్నాయి. అలా ఈ వారం కూడా కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల కావడానికి రెడీ గా ఉండగా, మరికొన్ని సినిమాలు ఓటిటి లలో విడుదల కావడానికి రెడీ గా ఉన్నాయి. అలా ఈ వారం థియేటర్లలో, మరియు ఓటిటి లలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల గురించి మనం తెలుసుకుందాం..

అసలేం జరిగింది : శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా న‌టించిన ఈ మూవీ ఈ నెల 22 న థియేటర్లలో విడుదల కానుంది. ఎన్వీఆర్ దర్శకత్వం వహించగా, ఎక్స్‌డోస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ ఈ సినిమాను నిర్మించారు.

నాట్యం : ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నటిగా పరిచయమవుతూ, సొంతంగా నిర్మించిన సినిమా నాట్యం. ఈ సినిమా అక్టోబర్ 22న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించాడు.

మధుర వైన్స్ : నూతన నటీనటులు సన్నీ నవీన్‌, సీమా చౌదరీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మధురవైన్స్‌’. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 22న ప్రేక్షకులను అలరించనుంది.

లవ్ స్టోరీ : నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కి ఇప్పటికే థియేటర్లలో విడుదలై మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా అక్టోబర్ 22 సాయంత్రం 6 గంటల నుండి తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా  లో స్ట్రీమ్మింగ్ కానుంది.

హెడ్స్‌ అండ్‌ టేల్స్‌ : సునీల్‌, సుహాస్‌ చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిచిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’లో అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: