మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు మెగా క్యాంప్ మద్దతు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. నాగబాబు సైతం చిరంజీవి మద్దతు ప్రకాష్ రాజ్ కు ఉందని చెప్పుకొచ్చారని తెలుస్తుంది.


అయితే ఎన్నికలలో గెలవడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విష్ణు విజయం సాధించారని సమాచారం. విష్ణు అధ్యక్ష పదవికి ఎంపికైన తర్వాత అక్కడితో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అందరూ భావించారట.


అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేసి తన ప్యానల్ తరపున గెలిచిన వాళ్లతో సైతం రాజీనామా చేయించారని తెలుస్తుంది.. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన తీరు గురించి ప్రకాష్ రాజ్ కోర్టుకు వెళ్లే ఛాన్స్ ఉందని కూడా వార్తలు వస్తున్నాయని సమాచారం.తెగే వరకు ప్రకాష్ రాజ్ లాగడం సరికాదని కామెంట్లు వినిపిస్తున్నాయని తెలుస్తుంది.


అయితే మరోవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు చిరంజీవికి ఏ మాత్రం నచ్చడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయని సమాచారం.. ప్రకాష్ రాజ్ సొంతంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళుతున్నారని సమాచారం.. మెగా వర్గం తనకు ఓపెన్ గా మద్దతు ప్రకటించి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవని ప్రకాష్ రాజ్ ఆవేదన చెందుతున్నట్టు సమాచారం.చిరంజీవి ఇప్పటికే ప్రకాష్ రాజ్ కు సైలెంట్ అయిపోవాలనే సందేశాన్ని పంపారని అయితే ప్రకాష్ రాజ్ మాత్రం ఆ సందేశాన్ని కూడా పట్టించుకోలేదని సమాచారం.. ప్రకాష్ రాజ్ తన ప్రవర్తనతో తప్పు చేస్తున్నాడని అభిప్రాయాలు వినిపిస్తుండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.చిరంజీవి సైతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వివాదానికి వీలైనంత దూరంగా ఉంటూ అందరివాడు అనిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.ప్రకాష్ రాజ్ ఏ విధంగా ముందుకు సాగి పోతాడో చూడాలి మరి...

మరింత సమాచారం తెలుసుకోండి: