పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ ఒక సినిమా త్వరలో తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. భవదీయుడు భగత్ సింగ్ పేరుతో రూపొందనున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించనుండగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని ఎంతో భారీ రేంజ్ లో నిర్మించనున్నారు. ఇటీవల పవర్ స్టార్ జన్మదినం సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కి అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ లభించింది. పవన్ కళ్యాణ్ పాత్ర ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా ఉంటుందని, అలానే ఈసారి వీరిద్దరి కలయికలో రానున్న ఈ సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ తో మాత్రమే కాకుండా భారీ యాక్షన్ తో పాటు కొంత పొలిటికల్ అంశాల కు సంబంధించి కూడా సాగనున్నట్లు సమాచారం.

గతంలో పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన హరీష్ శంకర్ ఈసారి తప్పకుండా ఆయనతో మరొక బ్లాక్ బస్టర్ కొట్టేందుకు అన్నివిధాలా సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రానాతో కలిసి సాగర్ కె చంద్ర తీస్తున్న భీమ్లా నాయక్ సినిమాతో బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్, అది పూర్తి అయిన తరువాత ఈ సినిమా మొదలెట్టనున్నారట. ఇక ఇటీవల క్రిష్ తో చేస్తున్న హరిహర వీరమల్లు మూవీ షూట్ ని సగం కంప్లీట్ చేసిన పవన్, దానితో పాటు భవదీయుడు షూట్ లో కూడా పాల్గొననున్నారట.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనే దానిపై కొన్నాళ్లుగా పలువురు కథానాయికల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవగా, ఫైనల్ గా ఈ మూవీ లో పూజా హెగ్డే ని ఖాయం చేసిందట యూనిట్. ఇప్పటికే పలువురుని పరిశీలించిన దర్శకుడు హరీష్ శంకర్, పక్కాగా ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కి పూజా అయితేనే కరెక్ట్ అని భావించి ఆమెను ఎంపిక చేసినట్లు టాక్. మరి ఇదే కనుక నిజం అయితే తొలిసారిగా పవర్ స్టార్ ప్రక్కన జోడీగా పూజా ఛాన్స్ అందుకున్నట్లే అంటున్నారు సినిమా విశ్లేషకులు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: