హీరో అనగానే మనకు అందాల నటుడు శోభన్ బాబు గుర్తుకువస్తారు. ఆ మాటకు వస్తే పాత రోజుల్లో హీరోలు అందరూ అలాగే ఉండేవారు. తరువాత కాలంలో అందం కంటే మిగిలిన క్వాలిటీస్ ముందుకు వచ్చాయి. దాంతో ఎవరైనా హీరో అన్న భావన బలపడింది.

ఇదంతా ఎందుకు అంటే టాలీవుడ్ లో అందమైన యంగ్ హీరోలు తక్కువగా వస్తున్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ ఒకరు. రోషన్ కేవలం అందంగా ఉండడమే కాదు, మంచి ఈజ్ ఉన్న నటుడిగా ఇప్పటికే  ప్రూవ్ చేసుకున్నారు. అంతేనా డ్యాన్సులలో కూడా విరగదీస్తున్నారు. సరైన సబ్జెక్ట్ పడితే ఈ కుర్రాడు గుంటూరు మిర్చీలా హీటెక్కించి టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్లేస్ ని క్రియేట్ చేసుకోవడం ఖాయం.

అయితే శ్రీకాంత్ బ్యాక్  బోన్ గా ఉన్నా కూడా రోషన్ కి సరైన సినిమా అయితే పడడంలేదు. ఈ కుర్రాడు టీనేజ్ లో ఉండగానే నిర్మలా కాన్వెంట్ అన్న మూవీ చేశాడు. అలా తొందరపడి సరైన సబ్జెక్ట్ లేకుండా చేసిన ఆ మూవీ బ్యాడ్ రిజల్ట్ ఇచ్చింది. ఇక ఇపుడు పెళ్ళి సందడి పేరుతో చేసిన మూవీ కూడా నిరాశపరచింది. ఈ మూవీలో సాంగ్స్ బాగున్నాయి. హీరోయిన్, హీరో ఇద్దరూ బాగున్నారు. కానీ కధ కధనం, డైరెక్షన్ ఇవే మైనస్ అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే యంగ్ హీరోతో అవుట్ డేట్ సబ్జెక్ట్ చేయించారు అన్నదే టాక్.

దాంతో రోషన్ కి మళ్లీ ఫ్లాప్ వచ్చింది.  అది రోషన్ తప్పు ఎంతమాత్రం కాదు అనే చెప్పాలి. రోషన్ బాగా చేస్తాడు అని అంతా ఒప్పుకుంటున్నారు. మరి ఇప్పటికైనా శ్రీకాంత్ సరైన సబ్జెక్ట్ ని పెట్టుకుని ఇప్పటి జనరేషన్ కి కనెక్ట్ అయ్యే విధంగా మూవీని తీసే డైరెక్టర్ చేతిలో కనుక రోషన్ ని పెడితే ఫస్ట్ హిట్ అందుకుంటాడు అంటున్నారు. టాలీవుడ్ కి అన్ని విధాలుగా సూట్ అయ్యే హీరో మెటీరియల్ ఉన్న రోషన్ కెరీర్ విషయంలో శ్రీకాంత్  ఇకనైనా సీరియస్ గా ఆలోచిస్తే మాత్రం కుర్రోడు సూపర్ హిట్టే అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: