IHG

సినిమాలు నానాటికి కొత్త టెక్నాలజీస్ ఉపయోగించుకుని ప్రేక్షకుడిని అలరిస్తున్నాయి. సినిమాలు కేవలం ఆహ్లాదకరమైన ప్రాంతాల్లోనే కాకుండా సముద్ర అత్యంత లోతుల్లోనూ చలిగా ఉన్న మంచు శిఖరాలపైన  కూడా జరుగుతుంటాయి. తాజాగా రష్యా కి చెందిన చిత్ర బృందం ఏకంగా అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISS) లో పన్నెండు రోజులపాటు  షూటింగ్ జరుపుకుని  భూమికి తిరిగి వచ్చింది. ఈ షూటింగ్ లో మొదటిసారిగా నటి యూలియా పేరెసిల్డ్ , చిత్ర డైరెక్టర్ , మరియు చిత్ర హీరో లు ISS లో 12 రోజులు గడిపి షూటింగ్ ను పూర్తి చేసుకుని వచ్చారు.ప్రస్తుతం ఈ సినిమా నటీనటులు , డైరెక్టర్ వార్తల్లో నిలిచారు.

IHG


 గడచిన ఆదివారం యులియా (37), క్లిమ్ షిపెన్ కో (38) మరియు డైరెక్టర్లు 4.36 ని.లకు భూమి పైకి తిరిగి వచ్చారు. ఈ సంఘటనను రష్యాకు చెందిన రాస్కోస్మోస్ స్పేస్ ఏజెన్సీ టీవీ ఛానళ్లలో ప్రత్యేక్ష ప్రసారం చేసింది.  క్లిమ్ షిపెన్ కో మాత్రం  స్పేస్ క్యాప్స్యూల్ నుంచి బయటికి వచ్చిన తరువాత కాస్త అస్వస్థత గా గురిఅయినట్లు తెలుస్తోంది. కానీ ఆయనమాత్రం  స్పేస్ క్యాప్స్యూల్ నుండి బయటకు వచ్చిన తరువాత అభిమానులకు మరియు కెమెరాలకు చేయి ఊపుతూ వెళ్లినట్లు కనిపించింది.  ఈ చిత్ర హీరో కోసం  దాదాపుగా 3000 దరఖాస్తుదారుల  పరిశీలించగా కేవలం అతను మాత్రమే ఎన్నికైనట్లు డైరెక్టర్ తెలిపారు .

IHG


 చిత్ర బృందం లో ని హీరోయిన్ యులియా మాట్లాడుతూ...మొదట అంతరిక్షం లో 12 రోజులు షూటింగ్ అంటే అన్ని రోజులు ఎలగడుస్తాయో అనుకున్నాను కానీ స్పేస్ నుండి క్రిందకు వస్తుంటే 12  రోజులు అప్పుడే ఐపోయాయా అని అనిపించింది అని మాలియా పేర్కొంది . ట్వంటీ ఫస్ట్ సెంచురీ లో అంతరిక్ష పోటీ అనే అంశంతో నిర్మిస్తున్న " ది ఛాలెంజ్ " సినిమా చిత్రీకరణ కోసం అంటోన్ ష్కప్లేరోవ్ తో కలసి కజకిస్తాన్ బీకనీర్ కాస్మొడ్రోమ్ అనే ప్రాంతం నుండి షూటింగ్ బృందం బయలుదేరి వెళ్ళింది  నాసా , ఈ చిత్రాన్ని  స్పేస్ ఎక్స్ మరియు ఎలెన్ మాస్క్ సంయుక్తంగా నిర్వహించారు. అయితే ఈ చిత్రనికైనా ఖర్చు మరియు చిత్ర విశేషాలను గోప్యంగా ఉంచారు చిత్ర యూనిట్. ఈ చిత్రానికి పనిచేసిన వ్యోమగాములు ఈ చిత్రం లో అతిధి పాత్ర దారులుగా పనిచేసారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: