అక్కినేని నాగ చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత స‌మంత మ‌ళ్లీ సినిమా ల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. వీరిద్ద‌రి విడాకుల గురించి నెల‌న్న‌ర పాటు ర‌క‌ర‌కాల వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. ఇక చైతు విడాకుల విష‌యం నుంచి ఇప్పుడిప్పుడే రిలాక్స్ అవుతోన్న ఆమె తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. తెలుగు లో ఆమె ప్ర‌స్తుతం మూడు సినిమాలు ఒప్పుకుంది. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో ఆమె న‌టించిన శాకుంత‌లం సినిమా త్వ‌ర‌లోనే రిలీజ్ కు రెడీ అవుతోంది.

సినిమా మాత్ర‌మే కాకుండా మ‌రో మూడు సినిమాలు లైన్లో పెట్టింది. దీంతో పాటు కోలీవుడ్ నుంచి కూడా స‌మంత‌కు స్టార్ సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఇప్పుడు ఆమెకు ఓ బాలీవుడ్ సినిమా లో కూడా ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు టాక్ ?  బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో సినిమాలో న‌టించేందుకు ఆమె సైన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఫ్యామిలీమ్యాన్ -2 వెబ్ సిరీస్ తో అందరికి దగ్గరైన సమంత బోల్డ్ న‌ట‌న‌కు అక్క‌డ ప్రేక్ష‌కులు కూడా ఫుల్ ఫిదా అయిపోయారు. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ న‌టిస్తోన్న సినిమాకు కోలీవుడ్ ద‌ర్శ‌కుడు అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

అట్లీ ఇప్ప‌టికే సౌత్ ఇండియాలో స్టార్ హీరోల‌తో సినిమాలు చేసి హిట్లు కొట్టి స‌త్తా చాటాడు. ఈ క్ర‌మంలోనే షారుక్ సైతం అట్లీకి బంప‌ర్ ఛాన్స్ ఇచ్చాడు. ప‌వ‌ర్ ఫుల్ క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్క నుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా లో ముందుగా న‌య‌న‌తార‌ను హీరోయిన్ గా అనుకున్నారు. చివ‌ర‌కు ఆమె ప్లేస్ లో స‌మంత‌ను హీరోయిన్ గా తీసుకోవాల‌ని ఫిక్స్ అయిన‌ట్టు టాక్ ?  ఆమె ఈ సినిమాలో న‌టిస్తోన్నందుకు గాను రు. 7 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంద‌ట‌. స‌మంత‌కు పెళ్ల‌య్యి విడాకుల త‌ర్వాత కూడా ఈ రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ అంటే మామూలు విష‌యం కాదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: