టాలీవుడ్ లో జ‌యంత్ సీ ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈశ్వర్ సినిమాతో వెండి తెర పైకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ రాజు. సీనియ‌ర్ న‌టుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడి గా... అటు దివంగ‌త నిర్మాత సూర్యనారాయణరాజు తనయుడిగా ప్ర‌భాస్ వెండి తెర‌ ఎంట్రీ సజావుగానే సాగింది. ఈశ్వ‌ర్ యావ‌రేజ్‌, త‌ర్వాత సురేష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రాఘ‌వేంద్ర డిజాస్ట‌ర్‌. కెరీర్ ఆరంభంలో ప్ర‌భాస్‌కు అనుకున్న విజ‌యాలు ద‌క్క‌లేదు.

ఆ త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ అమాంతం మారిపోయింది. మ‌నోడు స్టార్ హీరోల‌ను మించిన స్టార్ హీరో అయిపోయాడు. ఇప్పుడు ఏకంగా వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాల‌తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. వర్షం , ఛత్రపతి , అతడి రేంజునే మార్చేశాయి. ఇక బాహుబ‌లి దెబ్బ‌తో ఇప్పుడు దేశంలో నే అది పెద్ద పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ప్ర‌భాస్ వ‌రుస‌గా స‌లార్ - ఆదిపురుష్ - రాధే శ్యామ్ లాంటి టాప్ సినిమాలు చేస్తున్నాడు.

ఇక ప్ర‌భాస్‌ను అంద‌రూ డార్లింగ్ అని ముద్దుగా పిలుచు కుంటూ ఉంటారు. అయితే ఆ ప‌దం ఎలా వ‌చ్చింది ? అన్న‌ది కాస్త ఇంట్ర‌స్టింగ్ విష‌య‌మే.. ! ప్ర‌భాస్ హీరో గా డార్లింగ్ పేరుతో ఓ సినిమా కూడా తీశారు. బుజ్జిగాడు సినిమాలో పూరిని ప్రేమిస్తున్నాన‌ని ఆట ప‌ట్టించ‌డం తో పాటు స‌ర‌దాగా డార్లింగ్ అని పిలుచుకునే వాడ‌ట‌ ప్ర‌భాస్‌.

ఆ త‌ర్వాత‌ బుజ్జిగాడు సినిమా లో డార్లింగ్ అంటూ ప్రభాస్ యాక్టింగ్ అంద‌రిని బాగా ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత ప్ర‌భాస్ త‌న‌కు బాగా క‌నెక్ట్ అయిన వారిని డార్లింగ్ డార్లింగ్ అని పిలిచే వాడ‌ట‌. ఆ త‌ర్వాత ప్ర‌భాస్ ని కూడా అంద‌రూ డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తూ ఉండేవార‌ట‌. చివ‌ర‌కు అదే పేరు మ‌నోడికి అలా స్థిర ప‌డిపోయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: