2000లలో కుటుంబ కథా చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. దాదాపుగా అప్పట్లో వచ్చిన అన్నీ కుటుంబ కథా చిత్రాలకూ మంచి ఆదరణ లభించింది అనే చెప్పాలి. అందులో భార్య పాత్రల్లో స్టార్ హీరోయిన్లు కూడా మెప్పించారు. ఆ జాబితాలో రాశి ముందు వరుసలో ఉంటుంది. ఈ అందాల రాశి 20లలో ఎంతో మందికి కలల రాణి. ఆమె అందానికి పడుకొని కుర్రకారు అప్పట్లో లేదంటే అతిశయోక్తి కాదు. కళ్ళతోనే పలికించే హావభావాలు, ఇట్టే ఆకట్టుకునే శరీరాకృతి వెరసి ఈ రాశి వెండితెరపై స్టార్ అయింది. నిజానికి ఆమెకు గ్లామరస్ రోల్స్ కంటే సతీమణి గానే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆమెకు ఫ్యామిలీ ఆడియన్స్ లో విశేష ఆదరణ లభించేది. రాసి సినిమాలు థియేటర్లకు క్యూ కట్టడం కాకుండా టీవీలలో వచ్చినా వదిలి పెట్టేవారు కాదు. అలాంటి అందం ఆమె సొంతం. ఈ అందాలరాశి ఇ వెండితెరపై స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో రాశిదే హవా అంటే అతిశయోక్తి కాదు. ప్రేయసి రావే చిత్రంలో భార్యగా నటించిన ఆమె పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ చిత్రానికి గాను ఆమె బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిలింఫేర్ అవార్డ్ కు నామినేట్ అయింది. అవార్డు అందుకున్న టంతటి పర్ఫామెన్స్ తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది రాశి. శ్రీకాంత్ ప్రేయసిగా, మరొకరి భార్యగా ఇబ్బందులు పడే మహిళ పాత్రలో ఆమె నటన అద్భుతం. ఆ కట్టు బొట్టు చూస్తే వైఫ్ అంటే ఇలాగే ఉండాలి అన్పిస్తుంది. నిజానికి ఆ పాత్రలో నటించడం సాహసమనే చెప్పాలి. సాధారణంగా సమాజం ఇలాంటి వాటిని అసలు యాక్సెప్ట్ చేయదు. కానీ ఆ పాత్రలో రాశిని చూసిన ప్రతి ఒక్కరూ ఆమె పాత్రను ఫీల్ అయ్యారు. ఆదరించారు. అప్పట్లో ఎన్నికలను ఒక ఊపేసిన రాశి ప్రస్తుతానికి సీరియల్స్ లో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: