ఓక వైపు తెలుగు రాష్ట్రాలు ఎంతగానో అభిమానించే హీరో నాని, మరొకవైపు ఓ కొత్త అమ్మాయి.. అంత పెద్ద హీరో సరసన ఇంత గొప్ప సినిమాలో అందులోనూ తెలుగులో తొలిసారిగా చేయబోతున్న నటి హీరోయిన్ గా అవసరమా అని అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. ఈ పాటికే మీకు ఆ సినిమా ఏంటో ఆ హీరోయిన్ ఎవరో  అర్థమైపోయి ఉంటుంది. జాతీయ అవార్డ్ దక్కించుకొని తెలుగు సినిమా స్థాయిని పెంచిన జెర్సీ చిత్రంలో నాని హీరోగా నటించగా హీరోయిన్ గా చేసిన శ్రద్ధ శ్రీనివాస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకో బోతున్నాం.

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తొలిసారిగా ఈ చిత్రంతోనే అడుగుపెట్టిన ఈమె హీరోయిన్ అనగానే అందరూ తెగ టెన్షన్ పడ్డారు. అయితే ఈ సినిమాలో ఆమె నటన చూసిన తరువాత ప్రతి ఒక్కరూ ఆమె నటనను పొగడక తప్పలేదు. నాని తో సరి సమానంగా పోటా పోటీగా నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈమె. అంతకుముందు తమిళ కన్నడ పరిశ్రమలలో సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ తెలుగులో తొలిసారిగా నటించి ఫస్ట్ టైం చేసిన హీరోయిన్ గా ఏ మాత్రం డౌట్ రాకుండా కనిపించలేదు.

సినిమా నేషనల్ స్థాయిలో అవార్డు రావడానికి ఈమె పాత్ర కూడా ఒక ముఖ్యమైన కారణం అని చెప్పవచ్చు. క్రికెటర్ కావాలనుకున్నా తన భర్త కలను నెరవేర్చడనికి సాయశక్తులా ప్రయత్నించింది కానీ ఒకానొక దశలో ఆయన ఫెయిల్యూర్ అయితే ఆయన స్థానంలో ఇంటికి ముందుకు నడిపించిన భార్య పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది. సెటిల్డ్ గా భార్య గా ఏ విధమైన లక్షణాలు తన మొహంలో కనిపించాలో ఆ విధమైన హావ భావాలు పలికించి ప్రేక్షకులను మెప్పించింది. హావభావాలు పలికించడంలో నాని నే ఒకానొక దశలో మించి పోయింది ఈ హీరోయిన్. 

మరింత సమాచారం తెలుసుకోండి: