నటిగా సమంత ఎంత బాగా ఎంత గొప్పగా నటిస్తుందో అందరికీ తెలిసిందే. ఏ మాయ చేసావే చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఈమె ఆ తరువాత ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. హీరోయిన్ గా మాత్రమే కాదు తన పాత్రకు మంచి అర్థం ఉండి తాను నటించ గలనని నమ్మితే మాత్రం ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధం సమంత. ఆ విధంగా ఆమెలోని సరికొత్త నటనా కోణాన్ని ప్రపంచానికి చూపించిన సినిమా మజిలీ.

అక్కినేని నాగచైతన్య హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మజిలీ సినిమాలో సమంత పాత్ర హైలెట్ కాగా ఆ పాత్రను సమంత పోషించడంతో ఈ సినిమాపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది. అప్పటికే అక్కినేని నాగచైతన్య మరియు సమంత లు వివాహం చేసుకోవడంతో పెళ్లి తర్వాత వారిద్దరూ కలిసి నటించే మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ప్రేమలో విఫలమైన హీరో ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ ఉంటుంది
 సమంత.

కానీ అయిష్టంతోనే ఆమెను పెళ్లి చేసుకున్న హీరో ఆమెను మాత్రం భార్యల చూడడు కానీ ఆమె మాత్రం భర్తే సర్వస్వంగా బ్రతుకుతూ ఉంటుంది. తను ఇంతలా ప్రేమించే భార్యను తాను తిరిగి ఎలా ప్రేమించి ఆమెతో మంచి జీవితాన్ని గడిపాడు. ఎలాంటి పరిస్థితులు వారిద్దరి మధ్య ప్రేమ చిగురించేలా చేశాయి.. దానికి గల కారణాలు ఏంటి అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో మెయిన్ హైలెట్ హీరో భార్య పాత్ర అని చెప్పాలి. ఇష్టంలేదని మొహం మీద ఎన్ని సార్లు చెప్పినా కూడా భర్త మీద ప్రేమతో ఆయనే సర్వసంగ ఉంటూ నిజ జీవితంలో ఇలాంటి భార్య ఉంటే నిజంగా అదృష్ట వంతుడే, అలాంటి భార్య నే కోరుకుంటారు అనిపించేలా ఈమె పాత్రను సమంత అద్భుతంగా పోషించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: