టాలీవుడ్ లో ఈ మధ్య కొత్త కథలు, పాత్రలు ఎక్కువగా వస్తున్నాయి. కొత్తగా  వచ్చే డైరెక్టర్స్ మూస ధోరణిలో కాకుండా డిఫరెంట్ కథలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడ్తున్నరు.అలా వచ్చిన డైరెక్టర్స్ లో హర్షిత్ గోలి ఒకరు. ఆయన తీసిన రాజా రాజా చోరా ఈమధ్యనే విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ సినిమా చూసిన అందరికి ఒక పాత్ర బాగా గుర్తుండిపోతుంది.

 ఆ పాత్రనే హీరోకి భార్య గా చేసిన విద్య . తెలుగులో కొన్ని  సినిమాలు తమిళంలో కొన్ని సినిమాలు చేస్తూ మెల్లగా క్రేజ్ తెచుకుంటున్న సునైన ఈ సినిమాలో ఆ పాత్ర చేసింది. చాలామంది ఆమెని ఇంతకముందు కూడా చూసి ఉండరు. కానీ ఈ సినిమాలో ఆమె భార్యగా నాచురల్ లుక్ లో చేసిన నటన నిజంగా సూపర్బ్ అనే చెప్పాలి. తన భర్త తప్పు చేసిన కూడా సపోర్ట్ చేసే భార్య గా అలాగే కుటుంబాన్ని చూసుకుంటూ చదువుకునే అమ్మాయిగా ఆమె పాత్రలో ఒడిగిపోయింది. రాజా రాజా చోరా సినిమా హిట్ అవ్వడానికి సునైన పాత్ర చాలా వరకు కారణం అనే చెప్పాలి.

 ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు చేసిన భాస్కర్ పాత్ర కి ఆమెకి మధ్య డైలాగ్స్ కూడా చాలా బాగా ఉంటాయి. తెలుగులో ఈమధ్యలో వచ్చిన సినిమాల్లో హీరోయిన్ పాత్ర ఇంత బాగా రాసిన డైరెక్టర్ హర్షిత్ గోలి అనే చెప్పాలి. రాజా రాజా చోరా లో సునైన పాత్ర సినిమా మొదలైన గంట తర్వాత వచ్చిన కూడా ఆమె ఉండే ప్రతి సీన్ లో తన మార్కు ని చూపించింది. అలాగే ఈ సినిమాలో ఇంకొక హీరోయిన్ మేఘ ఆకాష్ ఉన్నపటికీ సునైన కె ఎక్కువగా యాక్టింగ్ కి స్కూప్ దొరికింది. ఈ సినిమా వల్ల సునైన తెలుగు లో మళ్ళీ ఛాన్సులి వస్తున్నాయి అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: