శ్రుతి హస్సన్ పేరు వింటేనే మనకు ముందుగా ఆమె నటించిన గ్లామరస్ రోల్స్ గుర్తొస్తాయి. కానీ శ్రుతి అందాలు అరబోసే పాత్రలే కాకుండా మంచి నటనని కనబరిచిన క్యారెక్టర్స్ కూడా చేసింది. అలా తన కెరీర్ లోనే బెస్ట్ యాక్టింగ్ చేసిన సినిమా 3 . వై దిస్ కొలవరి డి పాటతో సంచలనం సృష్టించిన 3 సినిమాలో శ్రుతి హసన్ నటన హైలెట్ అని చెప్పాలి.  హాయిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య భర్తలుగా ధనుష్ శ్రుతి హసన్ కనిపిస్తారు. భర్త ని ఎంతో ప్రేమించే భార్య గా శ్రుతి నటన సూపర్ ఉంటుంది. చివరిలో ధనుష్ చనిపోయిన విధానం తెలిసి ఎక్కి ఎక్కి ఏడ్చిన శ్రుతి ని చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాకుండా మానవు.

ధనుష్ చేసిన రామ్ క్యారెక్టర్ మానసిక వ్యాధి తో బాధపడుతుంటాడు. ఆ విషయం తెలియని జనని కి ఇలా ఎందుకు బెహేవ్ చేస్తున్నాడో అర్థం కాదు. భర్త ఏదో దాస్తున్నాడు అనే అనుమానం అలాగే తన మీద ప్రేమ ఇలా శ్రుతి హస్సన్ పాత్ర లో చాలా షేడ్స్ ఉంటాయి. ఇక ఈ సినిమాలో ధనుష్ , శ్రుతి హస్సన్ అద్భుతంగా నటించిన కూడా సినిమా మాత్రం అంత గొప్పగా ఆడలేదు. వై దిస్ కొలవారిడీ పాట వరల్డ్ ఫేమస్ అయిన కూడా ఈ సినిమా మాత్రం ప్లాప్ గానే నిలిచింది.

మొదటి భాగంలో మంచి ప్రేమ కథగా మొదలై రెండో భాగంలో మాత్రం కథ మొత్తం మారిపోతుంది. కానీ సినిమాలో ధనుష్ శ్రుతి హస్సన్ జంటకి మాత్రం చాలా పేరు వచ్చింది. అలాగే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అని అప్పట్లో రూమర్స్ కూడా వచ్చాయి. కానీ అవి కొన్ని రోజులకు మెల్లగా తగ్గిపోయాయి. నటనలో శృతి కి ఈ సినిమా వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: