ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ గా చలామణి అవుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో దీంతో ప్రభాస్ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి మాత్రమే కాకుండా మిగతా అన్ని ఇండస్ట్రీల్లో కూడా మార్మోగిపోతోంది. ఇక సినీ ఇండస్ట్రీలో ఒక్కో సినిమాకి వంద కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న హీరోగా ప్రభాస్ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. అంతేకాకుండా ప్రభాస్ చేస్తున్న వరుస సినిమాలు కూడా వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఉండటం విశేషం. ఇక ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి ప్రభాస్ కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు. 

ఆ విషయంలో ప్రభాస్ పెళ్లి విషయం కూడా ఉంది ప్రభాస్ వయస్సు 41 సంవత్సరాలు కాగా పెళ్లికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ మాత్రం రావడం లేదు.ప్రభాస్ పెళ్లికి సంబంధించి తరచుగా సరదాగా తీసుకుంటామని ప్రభాస్ పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని శ్యామల దేవి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటాడని ప్రభాస్ చెప్పాడని శ్యామలాదేవి పేర్కొన్నారు. ఇక ప్రభాస్ తనను ప్రేమగా కన్నమ్మ అని పిలుస్తారని.. తన పెద్ద నాన్న కృష్ణం రాజు పెద్ద బాజీ అని పిలుస్తారని.. అంతేకాకుండా తన ఫోన్ లలో సైతం తమ పేర్లను అదే విధంగా సేవ్ చేసుకున్నాడని శ్యామలా దేవి చెప్పుకొచ్చారు.

తమ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అని అన్నారు శ్యామల.ఇక అందరితో కలిసిపోయే అమ్మాయి కోసం వెతుకుతున్నామని ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు. 2023 వ సంవత్సరంలో ప్రభాస్ పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి అతని గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్ షూటింగ్ దాదాపు పూర్తయిందని.. త్వరలోనే సలార్ షూటింగ్ కూడా పూర్తి కాబోతునట్లు సమాచారం.ఇక కెరీర్ కు సంబంధించి ప్రభాస్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఇక ప్రభాస్ తన సినిమాల ప్రమోషన్ లో భాగంగా పెళ్లికి సంబంధించిన వార్తలపై ఏమైనా క్లారిటి ఇస్తాడో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: