మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజనుకు పైగా హీరోలు వెండి తెరకు పరిచయమయ్యారు. అందులో కొంతమంది స్టార్లుగా ఎదుగుతుంటే.. మరికొంతమంది స్టార్ గా ఎదగడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు.అలా ఎదగడానికి ప్రయత్నించిన వారిలో మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ కూడా ఒకరని చెప్పాలి. ఈ మధ్య కాలంలో అల్లు శిరీష్ ని తెలుగు ప్రేక్షకులు మర్చిపోయే పరిస్థితి నెలకొంది. దానికి అసలు దానికి కారణం అతని సినిమాలు రాకపోవడమే. వెండితెరపై 'గౌరవం' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. అయితే మొదటి సినిమా నిరాశపరిచింది. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా.. ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు.

 కొన్ని సినిమాలు ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న కానీ తనకు రావాల్సిన ఇమేజ్ మాత్రం ఇంకా రాలేదు. దానికోసం అల్లు శిరీష్ పాట్లు పడుతూనే ఉన్నాడు. నిజానికి అల్లు శిరీష్ కు వరుసగా సినిమాలు చేసే కెపాసిటీ ఉన్న కూడా ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. హీరోగా అతను తలుచుకుంటే ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేయొచ్చు. ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా దర్శకులు.. నిర్మాతలకు కొదవేలేదు. సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది. కానీ శిరీష్ మాత్రం అలా చేయకుండా ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు.శిరీష్ చివరి సినిమా విడుదలై దాదాపు మూడేళ్లు కావస్తోంది.అయినా ఇప్పటి వరకు తదుపరి సినిమా కనీసం మొదలుపెట్టినట్లు కూడా దాఖలాలు కనిపించడం లేదు.

ఆ మధ్య ఒకటి రెండు సినిమాల గురించి వార్తలు వచ్చాయి.. కానీ అవి ఇంకా పట్టాలెక్కాయా లేదా అనేది కూడా ఎవరికీ తెలియదు. ఒకవైపు అల్లుఅర్జున్ ఇతర మెగా హీరోలు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలనే పట్టుదలతో ఉన్నారు. కానీ అల్లు శిరీష్ మాత్రం ఏడాదికి కనీసం ఒక్క సినిమా కూడా చేయడం లేదు. ఈ కరోనా సమయంలో పలువురు పలు సినిమాలు చేశారు కానీ అల్లు శిరీష్ మాత్రం కొత్త సినిమాలేవీ కమిట్ అవ్వలేదు దాంతో అసలు సిరీస్ ఇండస్ట్రీలో ఉన్నాడా లేడా అంటూ కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కాబట్టి అల్లు శిరీష్ సినిమాలు పెద్ద ఎత్తున ఉంటాయని అందరూ అనుకున్నారు కానీ ఇప్పటివరకు అల్లు శిరీష్ కెరీర్లో చూసుకుంటే కేవలం మూడు నుంచి నాలుగు సినిమాలు మాత్రమే వచ్చాయి. వాటిలో ఏ ఒక్కటి కూడా పెద్దగా సక్సెస్ అనిపించుకున్న సినిమాలు లేవు. మరి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉండి ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది మాత్రం ఎవరికీ తెలియదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: