సమంత విడాకుల తర్వాత ఆమె కెరియర్ అంతటితో ముగిసినట్టే అనుకున్నారు. సినిమాలకి దూరమవుతుందని చాలా మంది భావించారు. కానీ ఈ విడాకుల తర్వాత సమంత టాలీవుడ్ లో ఒక సినిమా.. కోలీవుడ్ లో మరో సినిమాకు సంతకం పెట్టేసింది.
ఇక నయనతార, ప్రభుదేవాని పెళ్లి చేసుకున్నాక సినిమాలకి దూరమవుతుందని అప్పట్లో గాసిప్స్ పుట్టుకొచ్చాయి.  నయన్‌ కూడా 'శ్రీరామరాజ్యం' షూటింగ్‌ పూర్తయ్యాక కన్నీళ్లు పెట్టే సరికి కెరీర్‌కి బ్రేక్ ఇస్తుందని అంతా అనుకున్నారు. ప్రేమలో ఫెయిల్‌ అయ్యే సరికి మరింత కసిగా సినిమాలు చేసి.. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఇంకా మంచి పేరు సంపాదించుకుంది.

హీరో విజయ్‌తో విడిపోయాక అమలాపాల్‌ కూడా మళ్లీ కెరీర్‌ మొదలుపెట్టింది. రెగ్యులర్‌ స్టోరీస్‌తోపాటు లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్ కూడా చేస్తోంది. ఇక మళయాళీ స్టార్ దిలీప్‌తో విడిపోయాక మంజు వారియర్‌ కూడా స్ట్రాంగ్‌ రోల్స్‌తో కమ్‌ బ్యాక్ ఇచ్చింది. 'లూసిఫర్, అసురన్' లాంటి సినిమాలతో జనాలని మెప్పించింది.

దీపిక పదుకొణేకి లవ్‌లో రెండు గట్టిదెబ్బలు తగిలాయి. మొదట రణ్‌బీర్‌ కపూర్‌తో ప్రేమలో పడింది. అయితే ఈ హీరో కొన్నాళ్లకి కటీఫ్ చెప్పాడు. ఆ తర్వాత విజయ్ మాల్యా కొడుకు సిద్ధార్థ్‌ మాల్యాకి దగ్గరైంది. అయితే ఈ లవ్‌స్టోరి కూడా మధ్యలోనే ఎండ్‌ అయ్యింది. ఈ బ్రేకప్స్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది దీపిక. అయితే ట్రీట్ మెంట్ తో మళ్లీ నార్మల్ లైఫ్‌లోకి వచ్చింది. బాలీవుడ్‌ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.

ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది గానీ, బాలీవుడ్‌లో కెరీర్‌ బిగినింగ్‌లో చాలా ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేసింది. షారుఖ్ ఖాన్, అక్షయ్‌ కుమార్ లాంటి హీరోలతో లింక్ అప్స్‌ అని ప్రచారం జరిగినప్పుడు షారుఖ్ భార్య గౌరీ, అక్షయ్ భార్య ట్వింకిల్‌ ఖన్నా పెద్ద గొడవ చేశారని చెప్తారు. ఆ తర్వాత పీసీకి కొన్నాళ్ల పాటు సినిమాలు రాలేదు. ఈ షార్ట్ గ్యాప్‌ తర్వాత పీసీ మళ్లీ బిజీ అయ్యింది. ఇప్పుడు నిక్‌ జోనస్‌ని పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: