నేచుర‌ల్ స్టార్ నాని వ‌రుస పెట్టి సినిమాలు తీసుకుంటూ పోతున్నారు. నాని గ‌త యేడాది న‌టించిన వీ సినిమా క‌రోనా వ‌ల్ల థియేట‌ర్ల లోకి రాలేదు. వీ సినిమా డైరెక్టు గా ఓటీ టీ లోకి వ‌చ్చింది. సినిమా కు ఓ మోస్త‌రు టాక్ వ‌చ్చినా అనుకున్న స్థాయిలో ప్రేక్ష‌కుల మెప్పు పొంద లేక‌పోయింది. ఇక ఈ యేడాది క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత కూడా థియేట‌ర్లు ఓపెన్ అవుతున్నా కూడా నాని మ‌రో సినిమా ట‌క్ జ‌గ‌దీష్ ను కూడా ఓ టీటీలోకే రిలీజ్ చేశారు. ఈ సినిమా కు కూడా అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రావ‌డం లేదు.

ఇక తాజాగా నాని హీరోగా వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్.. ఈ సినిమాలో సాయిపల్లవి, కీర్తి శెట్టి లాంటి క్రేజీ హీరోయిన్లు వున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా కు పాజిటివ్ బ‌జ్ వ‌చ్చింది. ఇక ఈ సినిమాను డిసెంబ‌ర్ 24న క్రిస్మ‌స్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తున్న‌ట్టు ఎనౌన్స్ చేశారు. సినిమాకు బ‌జ్ బాగుం డ‌డంతో మార్కెట్ లో క్రేజ్ అయితే స్టార్ట్ అయింది.

జాతిరత్నాలు, కొండపొలం సినిమాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్ లక్ష్మణ్ ఈ  శ్యామ్ సింఘ రాయ్ రైట్స్ కోసం రంగంలోకి దిగి భేర సారాలు మొద‌లు పెట్టేశార‌ట‌. ఓవ‌రాల్ గా ఇంకా రేట్లు అయితే ఫిక్స్ కాలేదు కానీ.. సినిమాకు రు. 50 కోట్ల రేంజ్‌లో ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగే అవ‌కాశా లు ఉన్నాయంటున్నారు. నాని గ‌త రెండు సినిమాలు డైరెక్ట్ థియేట‌ర్ రిలీజ్ లేవు. ఆ రెండు సినిమాలు ఓటీ టీ లో వ‌చ్చాయి. అయినా కూడా ఈ టైంలో నాని సినిమాకు అదిరిపోయే డీల్ న‌డుస్తుండ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: