సూపర్ స్టార్ క్రిష్ణ, రెబెల్ స్టార్ క్రిష్ణం రాజు మంచి మిత్రులు. ఈ ఇద్దరూ దాదాపుగా ఒకేసారి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరి సినీ కెరీర్ కూడా సుదీర్ఘమైనది. ఇక డెబ్బై దశకంలో క్రిష్ణ తొందరగా స్టార్ ఇమేజ్ సాధించి ఏడాదికి డజన్ కి తక్కువ లేకుండా సినిమాలు చేస్తూ వచ్చారు.

అదే టైమ్ లో క్రిష్ణం రాజు హీరోగా నిలదొక్కుంటున్నాడు. ఆయన సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి భక్త కన్నప్ప లాంటి మూవీస్ తీసి స్టార్ ఇమేజ్ సాధించారు. ఈ నేపధ్యంలో ఆయనకు తిరుగులేని మాస్ ఇమేజ్ తెచ్చిన మూవీ కటకటాల రుద్రయ్య. ఈ మూవీని విజయమాధవి మూవీస్ పతాకంపైన ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ తీశారు. ఈ సినిమాకు దర్శకుడు దాసరి నారాయణరావు. ఈ మూవీకి మొదట అనుకున్న హీరో సూపర్ స్టార్ క్రిష్ణ. ఆయన కాల్షీట్లు కూడా ఇచ్చేశారు.

దాంతో చిత్ర నిర్మాణం మొదలుపెడదామనుకుంటున్న వేళలో సడెన్ గా క్రిష్ణ నుంచి నిర్మాత వడ్డే రమేష్ కి ఫోన్ వచ్చిందట. ఈ మూవీకి తాను కాల్షీట్లు పూర్తిగా అడ్జస్ట్ చేయలేనని, రోజుకు ఒక పూట మాత్రమే చేస్తామని క్రిష్ణ చెప్పారుట. అయితే దాని వల్ల తన మూవీ ఇబ్బందులో పడుతుంది అని ఆలోచించిన రమేష్ క్రిష్ణకు సున్నితంగా ఆ విషయం చెప్పేసి వచ్చేశారుట.

ఆ తరువాత ఆయన క్రిష్ణం రాజుని హీరోగా పెట్టి కటకటలా రుద్రయ్య తీశారు. ఈ మూవీలో కాస్తా విలన్ షేప్ తో మిక్స్ అయిన హీరో క్యారక్టరైజేషన్ అప్పటికి కొత్తది కావడంతో జనాలు కూడా బాగా ఆదరించారుట. క్రిష్ణం రాజు కూడా ఈ మూవీ కోసం బాగా కష్టపడ్డరుట. దీంతో ఈ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ సక్సెస్ అయింది. మొత్తానికి క్రిష్ణ చేయాల్సిన మూవీని క్రిష్ణం రాజు చేసి పక్కా మాస్ హీరోగా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు.



మరింత సమాచారం తెలుసుకోండి: