నాగ శౌర్య హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా వరుడు కావలెను, ఈ సినిమాను దసరా సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను దసరా బారి నుండి చిత్రబృందం తప్పించింది. ఈ సినిమాను అక్టోబర్ 29 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం ఆ మేరకు ఓ ప్రకటన కూడా చేసింది. అప్పటి వరకు ఈ సినిమా ఒక్కటే ఈ తేదీలో విడుదల కాబోయే క్రేజీ మూవీగా ఉంది. అయితే ఇలాంటి సందర్భంలోనే నాగ శౌర్య కు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురవుతోంది అని చెప్పవచ్చు. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ సినిమాను దీపావళి కానుకగా సెప్టెంబర్ 4 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం కొన్ని రోజుల క్రితం అఫీషియల్ గా ప్రకటించింది.

ఇలా విడుదల తేదీని ప్రకటించిన రొమాంటిక్ చిత్ర బృందం ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీని ముందుకు తీసుకువచ్చి అక్టోబర్ 29 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు రీసెంట్ గా ప్రకటించింది. అది మాత్రమే కాకుండా ఈ మధ్యే ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా బయటకు వదిలి ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ను చిత్ర బృందం మరింత పెంచింది. ఇప్పటికే నాగ శౌర్య హీరోగా నటిస్తున్న వరుడు కావలెను సినిమా కు సంబంధించిన టీజర్, పాటలకు జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా జనాలలో మంచి క్రేజ్ ఉన్న ఈ రెండు సినిమాలు ఒకే రోజు బాక్స్ ఆఫీసు వద్ద తలపడనున్నాయి. మరి ఈ రెండు సినిమాలలో ఏ సినిమా ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తుందో తెలియాలి అంటే విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: