కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఎవ్వరూ ఊహించని విధంగా విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం 'ఉప్పెన'. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మితమైన ఈ సినిమాతో మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ వెండితెరకి హీరోగా పరిచయం అయ్యాడు. ఇక ఇతనితో పాటు దర్శకుడిగా బుచ్చిబాబు.. హీరోయిన్ గా కృతి శెట్టి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు. కరోనా సమయంలో థియేటర్లలో కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్నా కూడా.. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఉప్పెన లాంటి కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక దర్శకుడిగా బుచ్చిబాబుకి ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు.

కానీ అలా జరగలేదు. సినిమా విడుదలై సుమారు ఎనిమిది నెలలు అవుతున్న బుజ్జి బాబు మాత్రం తన తరువాతి ప్రాజెక్ట్ను ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఉప్పెన సినిమా సీక్వెల్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు బుచ్చిబాబు. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపించాయి.ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత బుచ్చిబాబు సినిమా మొదలవుతుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఎన్టీఆర్ బుచ్చిబాబు కి నో చెప్పి కొరటాల శివకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇక ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్టు గా కూడా వార్తలు వినిపించాయి.

కానీ మోక్షజ్ఞ లాంచింగ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో జరిగేలా కనిపించడం లేదు. దీంతో బుచ్చిబాబు కెరీర్ ఇప్పుడు అయోమయంలో పడిపోయింది. ఇలాంటి సమయంలో ఉప్పెన సినిమా సీక్వెల్ గురించి పలు ఆసక్తికర విషయాలను బుచ్చిబాబు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో బుచ్చి బాబు మాట్లాడుతూ.. వైష్ణవ్ తేజ్ తోనే ఉప్పెన 2 కథను ముందుగా రాసుకున్నట్టు చెప్పాడు. ఉప్పెన 2 కథ ప్రపంచంలోనే ఎవరూ రాయని ఒక కథ అవుతుంది అని చెప్పుకొచ్చాడు. దీంతో ఉప్పెన సినిమాతోనే ఒక సరికొత్త వినూత్న ప్రయోగాన్ని చేసిన ఈ దర్శకుడు.. ఉప్పెన 2 తో ఎలాంటి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడో అని ఈ సినిమా సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: