శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'ఫిదా' అనే సినిమాతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది సౌత్ బ్యూటీ సాయిపల్లవి. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన అద్భుతమైన నటనతో, సహజమైన అందంతో కట్టిపడేసింది  నటనతో పాటు  అద్భుతమైన డాన్స్ తో ఆకట్టుకునే టాలెంట్ సాయిపల్లవి సొంతం. ఇప్పటికే ఫిదా సినిమాలో 'వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే' అంటూ ఇరగదీసే స్టెప్పులతో అదరహో అనిపించింది సాయి పల్లవి. ఆ పాట సోషల్ మీడియాలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక దాని తర్వాత ఇటీవల వచ్చిన 'లవ్ స్టోరీ' సినిమాలో 'సారంగదరియా' అనే పాటతో..

 సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని తన డాన్స్ తో మరోసారి ఫిదా చేసింది ఈ నేచురల్ బ్యూటీ.ఈ పాట యూట్యూబ్ లో 300 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.అంతేకాదు ఈ పాట మాస్ తో పాటు క్లాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఇక పాట తో పాటు ఇటీవల విడుదలైన ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది.ఇక ఇదిలా ఉంటే మరో సారి సారంగదరియా లాంటి పాట తో సాయి పల్లవి ప్రేక్షకులముందుకు మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతోందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఇంతకీ ఆ పాట ఏంటి? అది ఏ సినిమా లోనిది? అనేగా మీ సందేహం అక్కడికే వస్తున్నా. నాని హీరోగా నటిస్తున్న చిత్రం 'శ్యామ్ సింగరాయ్'..

ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి ఒక హీరోయిన్ గా నటిస్తోంది. అయితే సాయి పల్లవి డాన్సింగ్ టాలెంట్ ని ఈ సినిమా కోసం వాడుకోవాలని మేకర్స్ గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే  నవరాత్రి వేడుకల నేపథ్యంలో ఓ స్పెషల్ సాంగును శ్యామ్ సింగరాయ్ సినిమాలో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి బెంగాలీ యువతి పాత్రలో కనిపించనుంది. నవరాత్రి బ్యాక్ డ్రాప్ లో రాబోయే ఈ పాటను అత్యంత భారీ స్థాయిలో సినిమాకి హైలెట్ గా నిలిచేలా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.ఇక ఈ పాటతో సాయి పల్లవి మరోసారి తన డాన్స్ తో ఆకట్టుకోనున్న ట్లు సమాచారం. మొత్తానికి త్వరలోనే ఈ నేచురల్ బ్యూటీ మరో సెన్సేషనల్ సాంగ్ తో రికార్డుల వేట మొదలు పెట్టడం ఖాయమని తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: