ఈ మధ్యకాలంలో చాలా వరకు పాత కాలంలో వచ్చిన హైలెట్ సినిమా పాటలను తిరిగి కొత్త సినిమాలలో కూడా కొద్దిగా వెర్షన్ చేంజ్ చేసి తిరిగి అదే పాటలను హైలెట్ చేస్తున్న విషయం తెలిసిందే.. అందులో భాగంగానే ఈ మధ్య వచ్చిన సినిమా వరుడు కావలెను.. రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మొదటిసారి లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో సూర్య దేవా నిర్మిస్తున్న చిత్రం వరుడు కావలెను.. ఈ చిత్రంలో హీరోగా నాగసౌర్య, హీరోయిన్గా రీతూవర్మ నటించి అలరించనున్నారు.. నవంబర్ 2020 వ సంవత్సరంలో ఈ సినిమా చిత్రీకరణ షూటింగ్ ప్రారంభం కాగా, సినిమా మొత్తం హైదరాబాద్లోని చిత్రీకరించారు. ఆగస్టు 2021 నాటికి పూర్తి అయిన ఈ చిత్రం విడుదల తేదీని వాయిదా వేసుకుంటూ వస్తోంది..

ఇకపోతే దసరా పండుగ కానుకగా 2021 అక్టోబర్ 15వ తేదీన థియేట్రికల్ లో ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు..పరిస్థితులు అనుకూలించక 2021 నవంబర్ 5వ తేదీన విడుదల చేయాలని సిద్ధమవుతూ ఉన్నారు.. ఇక ఈ సినిమాలో నాలుగు పాటలు ఉండగా అందులో దిగు దిగు దిగు నాగా నాగోనా  దివ్యా సుందర నాగో అనే పాట మాత్రం ప్రస్తుతం చాలా  వరకు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.. అనంత శ్రీరామ్ ఈ పాటకు సాహిత్యం అందించగా, శ్రేయ ఘోషల్ తన మధురమైన గానాన్ని అందించి మంచి విజయాన్ని అందుకుంటుంది..

ఇకపోతే ఈ సినిమా 2016 సంవత్సరంలో వచ్చిన దిగు దిగు దిగు నాగ అనే డివోషనల్ సాంగ్ ను వరుడు కావలెను సినిమాలో ఎస్.ఎస్.థమన్ తనదైన శైలిలో  మార్చి ఐటమ్ సాంగ్ గా రూపుదిద్దారు.. అయితే ఇది డివోషనల్ అయినప్పటికీ ప్రస్తుతం వరుడు కావలెను సినిమాలో వచ్చిన పాట మాత్రం అందరి చేత ఈ పాట ని పాడించుకుంటోంది. ఇక ఈ పాటలో రీతూ వర్మ చాలా అద్భుతంగా డాన్స్ చేసింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: