ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న ఫారెస్ట్ యాక్షన్ డ్రామా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక మందన హీరోయిన్ గా, విలన్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో విడుదల కానుంది. డిసెంబర్ 17న రానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కాస్త ముందుగానే ప్రారంభించారు మేకర్స్. సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో మేకర్స్ గత కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన చిన్న టీజర్ కే రికార్డు స్థాయిలో వ్యూస్ రావడం రావడం విశేషం. ఇక ఈ చిత్రం నుంచి ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా విడుదల చేసిన మొదటి సాంగ్ 'దాక్కో దాక్కో మేక' సాంగ్ శ్రోతలను బాగా అలరించింది. 

ఈ సాంగ్ కు ముందుగా మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ తర్వాత తర్వాత లిరిక్స్ మ్యాజిక్ చేశాయి. లిరిక్స్ అల్లు అర్జున్ అభిమానులతో పాటు ఇతర శ్రోతలు కూడా ఫిదా అయిపోయారు. ఒకే ఒక సాంగ్ 'పుష్ప' రాజ్ దమ్ము ఏంటో చూపించాడు సుకుమార్. ఈ అద్భుతమైన పాటను సింగర్ శివమ్ పాడారు. లిరిక్స్ అందించింది పాపులర్ లిరిసిస్ట్ చంద్ర బోస్. దేవిశ్రీ ప్రసాద్ ఈ సాంగ్ తో మరోసారి రాక్ స్టార్ అనిపించుకున్నాడు. ఈ పాటలోని సాహిత్యం అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సాంగ్ లో చివరగా అల్లు అర్జున్ ఐకానిక్ స్టెప్ అయితే 'తగ్గేదే లే' అన్నట్టుగా ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ ను థియేటర్లో చూడడానికి అని అభిమానులు ఆతృత గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. నవంబర్ లో షూటింగ్ ను పూర్తి చేసి సినిమా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేయనున్నారు మేకర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: