మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో మన అందరికీ తెలిసిందే, చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా లో చిరంజీవి కి జంటగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తో పాటు చిరంజీవి మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలను చక చక పూర్తి చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి. తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదాళం కు తెలుగు  రీమేక్ గా తెరకెక్కనున్న బోలా శంకర్ సినిమా లో కూడా చిరంజీవి నటిస్తున్నాడు.

సినిమా కు మెహర్ రమేష్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా తో పాటు బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో కూడా చిరంజీవి ఒక సినిమాలో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా కొన్ని రోజుల క్రితమే జరిగింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది, దర్శకుడు బాబీ మెగాస్టార్ చిరంజీవి ని పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో చూపించబోతున్న ట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ, వెంకీ మామ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బాబీ మెగాస్టార్ చిరంజీవి ఫుల్ మాస్ పవర్ఫుల్ రోల్ చూపించబోతున్నట్లు అందుకు తగినట్టుగానే కథను కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: