జీవితంలో ఉన్న క‌ష్టాల‌ను ఒకే ఒక సాంగ్ లో కళ్ల ముందు క‌నిపించేలా చేసింది C\o కంచ‌ర పాలం లోని ఆశా పాశం పాట‌. C\o కంచ‌ర పాలం సినిమా కూడా ఎలాంటి అంచనాలు లేకుండా 2018 లో విడుద‌ల అయి పెద్ద హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా ఎంత పాపుల‌ర్ అయిందో దానికి రెట్టింపు పాపులారిటీ ఆశా పాశం పాట కు వ‌చ్చింది. ఈ పాట‌ను విన్న ప్ర‌తి సారి మ‌న జీవితంలో ఉన్న ఒడి దుడికులు క‌నిపిస్తాయి. ఈ సినిమా కు కూడా ఆశా పాశం పాట తో చాలా వ‌ర‌కు ప్ల‌స్ అయింది. ఈ సినిమా ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌ల అయి సినిమా విమ‌ర్శ‌కుల నుంచి ప్రశంశ‌లు అందుకుంది. దీంతో C\o కంచ‌ర పాలం సినిమా కు 2019 లో జీ సినీ అవార్డ్స్ లో ఉత్త‌మ విమ‌ర్శ‌కుల అవార్డును సొంతం చేసుకంది.



సినిమా లో ప్ర‌తి సీన్ ప్ర‌తి పాట హైలైట్ గా ఉంటాయి. అందులో ముఖ్యం గా చెప్పు కోద‌గ్గ పాట ఆశ పాశం బందీ చేసేలా సాగే కాలం ఆడే ఆటేలా.. అంటు వ‌చ్చే సాంగ్ చాలా పాపుల‌ర్ అయింది. ఈ పాట యూట్యూబ్ లో కూడా అనేక రికార్డు ల‌ను కొల్ల‌గొట్టింది. ప్ర‌స్తుతానికి ఆశా పాశాం అనే పాట యూట్యూబ్ లో 64 మిలియ‌న్ పైగా విక్ష‌న‌లు వ‌చ్చాయి. ఎలాంటి స్టార్ హీరోలు గానీ స్టార్ న‌టీ న‌టులు లేకుండా ఇన్ని వ్యూస్ ద‌క్క‌డం అనేది ఆ పాట కు వ‌చ్చిన గౌర‌వం అని అనుకోవాలి. అయితే ఈ పాట‌న‌ను విశ్వ అనే ర‌చ‌యిత రాశాడు. అలాగే అనురాగ్ కుల‌క‌ర్ణి అనే గాయ‌కుడు పాడాడు. సంగీతాన్ని స్వీక‌ర్ ఆగ‌స్తి అందించాడు. అయితే ఈ పాట‌కు ముఖ్యం గా అనురాగ్ కుల‌క‌ర్ణి వాయిస్ చాలా ప్ల‌స్ అయింది.




మరింత సమాచారం తెలుసుకోండి: