మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, బ్యూటీ ఫుల్ హీరోయిన్ స‌మంత జంట గా వ‌చ్చిన సినిమా రంగ‌స్థ‌లం. ఈ సినిమా మెగా వ‌ప‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హిట్ సినిమాల‌ల్లో రంగ‌స్థ‌లం ముందు వ‌రుస‌లో ఉంటుంది. ఈ సినిమా పెద్ద హిట్ కావ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి. సినిమా ప‌వ‌ర్ ఫుల్ క‌థ గానీ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ చెవుటి వాడిల చేసిన అద్భుత న‌ట‌న తో పాటు ఈ సినిమా కు పాట‌లు కూడా ఈ సినిమా హిట్ కావ‌డానికి కార‌ణాలు అని చెప్ప‌వ‌చ్చు. ఈ రంగ‌స్థ‌లం సినిమా దాదాపు అన్ని పాట‌లు కూడా పెద్ద హిట్ అయ్యాయి. అన్నింటిలో ది బెస్ట్ సాంగ్ అంటే రంగమ్మ మంగ‌మ్మ పాట అనే చెప్పాలి.



రంగ‌స్థ‌లం సినిమా లో రంగ‌మ్మ మంగ‌మ్మ పాట విడుద‌ల అయిన కొద్ది రోజుల్లో యూట్యూబ్ తో పాటు అన్ని డిజిట‌ల్ ఫ్లాట్ ఫాం ల‌లో అనేక రికార్డు ల‌ను కొల్ల‌గొట్టింది. ఈ పాట‌ను 2018 మార్చి నెల‌లో యూట్యూబ్ తో పాటు అన్ని డిజిట‌ల్ ఫ్లాట్ ఫాంల‌లో విడుద‌ల చేశారు. ఆనాటి నుంచి నేటి వ‌ర‌కు ఈ పాట కు క్రేజ్ ఏ మాత్రం కూడా త‌గ్గ లేద‌ని చెప్పాలి. ఈ పాట‌లో హీరోయిన్ స‌మంత అద్భుతంగా న‌టించింది. అలాగే రామ్ చ‌ర‌ణ్ కూడా ఏ మాత్రం త‌గ్గ‌లేదు. అలాగే వీరి కెమిస్ట్రీ కూడా ఈ పాట కు హైలైట్ గా నిలిచింది. దీంతో పాట కు తిరుగు లేకుండా హిట్ అందుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ  పాట‌ను యూట్యూబ్ లో దాదాపు 300 మిలియ‌న్ ల మంది చూశారు. ఈ రంగమ్మ మంగ‌మ్మ పాట‌కు లిరిక్స్ ను చంద్ర బోస్ రాశాడు. అలాగే సంగీతాన్ని దేవీ శ్రీ ప్ర‌సాద్ అందించాడు. అలాగే ఈ పాట‌ను ఎం ఎం మాన‌సి పాడారు.




మరింత సమాచారం తెలుసుకోండి: