శేఖర్ కమ్ముల సినిమా అంటే అందరూ ముందుగా ఎక్సపెక్ట్ చేసేది సినిమాలోని పాటలు. ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ రాధాకృష్ణ , ఆ తర్వాత మిక్కీ జే మేయర్ ఇప్పుడు పవన్. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరేనా గాని శేఖర్ కమ్ముల సినిమా అంటే అద్భుతమైన పాటలు అందిస్తారు. అలా ఈ మధ్య వచ్చిన లవ్ స్టొరీ సినిమాలో కూడా పవన్ సి హెచ్ గుర్తిండిపోయే పాటలన్ని ఇచ్చారు.

సినిమా విడుదలకి ముందు సరంగా దరియా పాట బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే లవ్ స్టొరీ విడుదలయ్యాక మాత్రం దాదాపుగా అందరికి నీ చిత్రం చూసి పాట బాగా నచ్చింది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఈ పాట వినదనికైనా చూడటానికి అయిన చాలా హాయిగా ఉంటుంది. డబ్బుల కోసం దుబాయ్ వెళ్లిన నాగ చైతన్య ,తన చెల్లి ని చూస్కోడానికి ఊరికి వచ్చిన సాయి పల్లవి ,ఇద్దరి మధ్యలో ఉండే దూరం ఈ పాట మనం చూడొచ్చు. ఈ సినిమాలో సరంగా దరియా పాట తర్వాత అంతా పాపులర్ అయిన పాట ఇదే.

 లవ్ స్టొరీ సినిమాకి పాటలు ఎంత ముఖ్యమో అందులోనూ ఇలంటి మెలోడీస్ పాటలు సినిమాకి ఎంత ప్రాణం పోస్తాయో శేఖర్ కమ్ముల బాగా తెలుసు. పవన్ సి హెచ్ లాంటి ఒక యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసిన పాటలు సినిమాని ఇంకోక రేంజ్ కి తీసుకొని వెళ్లాయి. అలాగే సినిమాలో సాయి పల్లవి , నాగ చైతన్య నటన వారి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండటంతో లవ్ స్టోరీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ని చిత్రం చూసి పాట లిరిక్స్ సురేందర్ రాయగా దానిని అంతే అద్భుతంగా అనురాగ్ కులకర్ణి పాడారు. ఈ పాటని ఒక్కసారి వినడం మొదలుపెడితే పదే పదే వినాలని అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: