అక్కినేని వంశంతో నాగార్జున త‌న‌యుడు, మూడో త‌రం వార‌సుడి గా సినిమాల్లోకి వ‌చ్చాడు అఖిల్. అప్పుడెప్పుడో ఆరేళ్ల క్రితం అగ్ర ద‌ర్శ‌కుడు వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో యంగ్ హీరో నితిన్ నిర్మాత‌గా అఖిల్ పేరునే టైటిల్ గా పెట్టుకుని అఖిల్ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. తొలి సినిమాతోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. త‌న త‌న‌యుడి లాంచింగ్ కోసం నాగార్జున ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. తీరా ఫ‌లితం చూశాక అంద‌రి మైండ్లు బ్లాక్ అయిపోయాయి. త‌న కుమారుడి కి హిట్ సినిమా తీసి ఇస్తాడ‌ని నాగార్జున వినాయక్ ను న‌మ్మితే విన‌యాక్ ఓ డిజాస్ట‌ర్ సినిమా తీసి అఖిల్ కు పెద్ద పీడ‌క‌ల‌ను మిగిల్చాడు.

త‌ర్వాత నాగార్జున స్వ‌యంగా రంగంలోకి దిగి త‌న బ్యాన‌ర్ లోనే మ‌నం ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌లో సినిమాను నిర్మించాడు. ఈ సినిమా కు ఎందు కో గా ని బాగుంద‌న్న టాక్ వ‌చ్చినా క‌మర్షియ‌ల్ గా మాత్రం ప్లాప్ అయ్యింది. బ‌డ్జెట్ ఓవ‌ర్ అవ్వ‌డం కూడా హ‌లో కొంప కొల్లేరు చేసింది. ఆ త‌ర్వాత తొలి ప్రేమ తో మంచి ఫామ్ లో ఉన్న యువ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి నమ్మి మిస్ట‌ర్ మ‌జ్జు చేశారు ఆ సినిమా కూడా ప్లాపే అయ్యింది.

ఆ త‌ర్వాత నాగార్జున కొడుకు ఒక్క హిట్ అయినా వ‌స్తుంద‌ని చివ‌ర‌కు గీతా బ్యాన‌ర్ చేతుల్లో పెట్టారు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ డైరెక్ట్ చేసిన మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ ఎట్ట‌కేల‌కు హిట్ అయ్యింది. పైగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కు బొమ్మ‌రిల్లు త‌ర్వాత హిట్ లేదు. అయినా అత‌డిని న‌మ్మి ఛాన్స్ ఇచ్చి హిట్ కొట్టారు. అయితే ఈ సినిమా క్రెడిట్ లో ఎక్కువ భాగం హీరోయిన్ పూజా హెగ్డే తో పాటు బ‌న్నీ వాస్ ,గీతా కాంపౌండ్ కు వెళ్లిపోయింది. దీంతో అఖిల్‌కు హిట్ వ‌చ్చినా మ‌నోడి కెరీర్ కు అంత ఉప‌యోగం లేద‌నే అంటున్నారు ఇండ‌స్ట్రీ వాళ్లు..!

మరింత సమాచారం తెలుసుకోండి: