నందమూరి బాలకృష్ణ ఓటీటీ మార్కెట్లోకి సరికొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఏదైనా వెబ్ సిరీస్ తో షాక్ ఇస్తాడనీ అనుకుంటే ఆయన ఎవరూ ఊహించని విధంగా ఒక డిఫరెంట్ షోతో సిద్ధమవుతున్నారనీ సమాచారం.

అన్ స్టాపబుల్ అనే ఆహా షోకు రాబోయే గెస్ట్ లు ఎవరు అనే విషయంలో కూడా ఇప్పటికీ నిర్వాహకులు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది.. ఇక షో కు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ కూడా మొదలు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


దీపావళి సందర్భంగా మొదటి ఎపిసోడ్ ను విడుదల చేయబోతున్నారనీ సమాచారం.ఇక డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు బాలయ్యతో మొదటి సారి ఈ షోలో పాల్గొన్నబోతున్నట్లు సమాచారం.ఇటీవల లాంచ్ ఈవెంట్ తోనే షో ఎలా కొనసాగుతుందో క్లారిటీ ఇచ్చేశారనీ తెలుస్తుంది.. ఇక ఆ విషయంలో కూడా అల్లు అరవింద్ కి ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మోహన్ బాబు తో మొదలు పెట్టే ఆ ప్రత్యేకమైన ఎపిసోడ్ ను దీపావళి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం అందింది.కేవలం సినీ తారలు మాత్రమే కాకుండా దర్శకులు మరియు నిర్మాతలు కూడా ఈ ప్రత్యేకమైన షోలు పాల్గొంటారని సమాచారం. ఇక మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ్ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు టాక్ బాగా వినిపిస్తుందని సమాచారం.మరి ఆ న్యూస్ ఎంతవరకు నిజం అవుతుందో వేచి చూడాలని తెలుస్తుంది.. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సంగతి అందరికి తెలిసిందే..


బాలకృష్ణ అంటే ఒక పవర్ మాస్ ఎమోషన్ అని అందరికి తెలుసు. ఆయన సినిమా అంటే ఎన్ని భారీ అంచనాలు వుంటాయో అందరికి తెలుసు. మరి ఆయన సినిమాలలోనే పవర్ ఫుల్ డైలాగ్ లతో మెప్పించిన బాలయ్య మరి ఓటీటీ మాధ్యమంలో ఏవిధంగా దుమ్ము లేపుతారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: