ఇక గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా టాలీవుడ్‌కు కరోనా మహమ్మారి భూతం పట్టుకుంది. దీంతో దాదాపుగా మూడు నెలల పాటు సినిమా విడుదలలు ఆగిపోవడం అనేది జరిగింది.ఇక టాలీవుడ్‌ పరిశ్రమకు చాలా కీలకమైన వేసవి సీజన్ కరోనా వైరస్ మహమ్మారికి భయపడటం అనేది జరిగింది.ఇక కరోనా వైరస్ బాగా ఇబ్బంది పెట్టినా కాని కొన్ని సినిమాలు మాత్రం టాలీవుడ్‌ బాక్స్ ఆఫీస్ కు కాసుల వర్షం కురిపించాయి. ఇక ఈ జాబితాలో టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా అగ్రస్థానంలో నిలిచింది. పవర్ స్టార్ వకీల్ సాబ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.86.36 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది.ఇక రెండో స్థానంలోనూ మెగా ఫ్యామిలీ సినిమానే ఉండటం అనేది విశేషం.మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన మూవీ రూ.51.52 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇక అలాగే మూడో స్థానంలో సంక్రాంతి బ్లాక్ బస్టర్ క్రాక్ సినిమా స్థానం సంపాదించింది. మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమా రూ.39.16 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టి మూడో స్థానం సొంతం చేసుకుంది.

ఇక టాలీవుడ్‌కు ఎక్కువ కలెక్షన్లు తెచ్చిపెట్టిన సినిమాల జాబితాలో జాతిరత్నాలు మూవీ నాలుగో స్థానంలో నిలవడం జరిగింది. ఈ సినిమా రూ.38.52 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. అలాగే ఐదో స్థానంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ 'లవ్‌స్టోరీ' సినిమా ఉంది. ఈ సినిమా టోటల్ రన్ ఇంకా ముగియలేదు. అయినా కాని ఈ సినిమా టాప్-5లో ఉంది. ఇక ఈ సినిమా ఇప్పటివరకు కూడా రూ.34.51 కోట్ల షేర్ ని వసూలు చేసింది.ఇక అయితే శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో ఈ సినిమా రాబోతుండటంతో టోటల్ రన్‌లో జాతిరత్నాలు మూవీని ఈ సినిమా అధిగమించే అవకాశాలు లేవనే చెప్పాలి. ఇక ఆరో స్థానంలో కూడా అక్కినేని వారి ఫ్యామిలీ మూవీనే ఉంది.ఇక అక్కినేని అఖిల్ మొదటి హిట్ మూవీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఇప్పటివరకు కూడా రూ.20.34 కోట్ల షేర్ వసూళ్ళని సాధించడం జరిగింది.ఇక ఏడో స్థానంలో రామ్ హీరోగా నటించిన రెడ్ సినిమా రూ.19.79 కోట్ల షేర్ వసూలు చేయగా , 8వ స్థానంలో నితిన్ హీరోగా నటించిన రంగ్ దే సినిమా (రూ.16.51 కోట్ల షేర్),అలాగే 9వ స్థానంలో తమిళ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ నటించిన డబ్బింగ్ సినిమా మాస్టర్ సినిమా (రూ.14.6 కోట్ల షేర్), 10వ స్థానంలో గోపీచంద్ సిటీమార్ సినిమాలు (రూ.11.02 కోట్ల షేర్) ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: