ఇక బాలీవుడ్‌ ఇండస్ట్రీని చాలా కాలం నుంచి కూడా ఈ డ్రగ్స్‌ కేసు అనేది బాగా కుదిపేస్తుంది. బాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య మరణం తరువాత నుంచి బాలీవుడ్ పరిస్థితి అసలేం బాగాలేదని చెప్పాలి. ఇక అప్పటినుంచి కూడా ఈ డ్రగ్స్ కేసు అనేది హాట్ టాపిక్ అవుతూ బాగా వైరల్ గా మారింది. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు డ్రగ్స్ కేసులో చిక్కుకొని సతమతం అవుతుండగా తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు తీవ్రంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో స్టార్ హీరోయిన్‌ అనన్య పాండే ఎన్సీబీ ఎదుట హాజరవ్వడం అనేది జరిగింది.అనన్య పాండే తండ్రి ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు చంకీ పాండేతో కలిసి ఆమె ఎన్సీబీ కార్యాలయానికి చేరుకోవడం అనేది జరిగింది. ఇక ఈరోజు ఉదయం పూట అనన్య ఇంట్లో కూడా సోదాలు నిర్వహించిన ఎన్సీబీ అధికారులు ఆమె ఫోన్‌ ఇంకా అలాగే ల్యాప్‌టాప్‌ను కూడా సీజ్‌ చేయడం అనేది జరిగింది.

ఇక ఈనెల 2 వ తేదీన ముంబైలో జరిగిన క్రూయిజ్‌ రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ కావాలని ఆర్యన్‌ ఖాన్ తన స్నేహితురాలు అనన్య పాండేకు వాట్సప్‌ చాట్‌ చేసినట్లు సమాచారం అందింది. అంతేకాకుండా ఈ చాట్‌లో ఈ బాలీవుడ్ భామ అనన్య పాండేతో పాటు ఆర్యన్‌ ఖాన్ సోదరి కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గారాల పట్టి అయినా సుహానా ఖాన్‌ కూడా ఉన్నట్లు సమాచారం అందింది. వీరంతా కూడా స్టార్‌ హీరోల పిల్లలు కావడంతో అందరికి ఓ కామన్‌ వాట్సాప్‌ గ్రూప్‌ అనేది ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇప్పుడిప్పుడే అనన్య పండే బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ హీరోయిన్ అవుతుంది.ఇక తెలుగులోనూ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ సరసన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్‌ అనే పాన్‌ ఇండియా సినిమాలో కూడా ఈ హాట్ బాలీవుడ్ బ్యూటీ నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: