ప్రస్తుతం ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ కలిసి తొలిసారిగా నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి తీస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమాలో హీరోయిన్స్ గా అలియా భట్, ఒలీవియా మోరిస్ నటిస్తుండగా సముద్రఖని, శ్రియ, రాహుల్ రామకృష్ణ, అజయ్ దేవగన్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర ని పోషిస్తుండగా ఎన్టీఆర్ కొమురం భీం గా కనిపించనున్నారు.

ఎన్టీఆర్, చరణ్ ఇద్దరి ఫస్ట్ లుక్ టీజర్లు ఇటీవల యూట్యూబ్ లో విడుదలై అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఎంతో గ్రాండ్ లెవెల్లో భారీ యాక్షన్ ఎమోషనల్ మూవీ గా రాజమౌళి తీస్తున్న ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు భాషల ఆడియన్స్ లో కూడా ఆకాశమే దీనిపై అంచనాలు నెలకొని ఉన్నాయి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోగా దీనిని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 7న విడుదల చేస్తున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది.

ఇక ఈ సినిమా నుండి కొద్దిరోజుల క్రితం దోస్తీ సాంగ్ కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే విషయం ఏమిటంటే ఈ సినిమా నుండి త్వరలో దీపావళి సందర్భంగా అందరూ ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయాలని భావిస్తోందట యూనిట్. ఇక ఇటీవల యూనిట్, ట్రైలర్ కట్ పనులు కూడా ప్రారంభించారని, త్వరలో ట్రైలర్ రిలీజ్ కి సంబంధించి ఆర్ఆర్ఆర్ వారి నుండి ఒక స్పెషల్ సర్ప్రైజింగ్ అనౌన్స్ మెంట్ కూడా రానుందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. మరి అదే కనుక నిజం అయితే అటు మెగా, ఇటు నందమూరి ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ అందరికీ ఇది సూపర్ న్యూస్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: