హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె ఎక్కువగా బోల్డ్ సినిమాల్లోనే నటిస్తూ బాగా పాపులర్ అయిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ భామ ఫుల్ బిజీ గానే ఉంటుంది. ఇక తాజాగా ఓటిటి ప్లాట్ఫారం లో కూడా అడుగుపెట్టబోతోంది అన్నట్లుగా చెప్పుకొస్తోంది. దీంతో ఈ అమ్మడికి అవకాశాలు బాగానే వస్తున్నాయి.


గత సంవత్సరం కూడా"అనగనగా ఒక అతిధి"అనేది సిరీస్ లో కూడా నటించి ఒక కొత్తదనాన్ని పరిచయం చేసింది. ఇక తాజాగా త్రీ రోజెస్.. అనే మరొక వెబ్ సిరీస్ తో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ వెబ్ సిరీస్ కూడా కాస్త బోల్డ్ గానే ఉండబోతున్నట్లుగా  తెలుపుతోంది. ఇక ఈ సిరీస్ లో హీరోగా "సౌరబ్ ధింగ్రా నటిస్తున్నారు. ఈ సిరీస్ లో మేము కొంచెం ఘాటైన సన్నివేశాలలో నటించడం అన్నట్టుగా తెలియజేస్తోంది పాయల్.

అలా నటించడం వల్లే మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని తెలుపుతోంది. దీంతో ఈ అమ్మడికి ఒక ప్రశ్న ఎదురైంది. సౌరబ్ తో రొమాన్స్ మీకు సౌకర్యంగానే ఉండేదా అనే ప్రశ్న ఎదురైంది.? మా ఇద్దరి మధ్య రొమాన్స్ కి నో చెప్పను అని తెలియజేసింది. మా ఇద్దరి కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇది ఒక మామూలు విషయం లాగానే చూడండి ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూడడం మానేయండి అంటూ తెలుపుతోంది.

సౌరబ్ కూడా ఒక కొత్త నటుడు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఇక ఈ వెబ్ సిరీస్ ను మారుతి తెరకెక్కించారు. ఇందులో మరికొంతమంది హీరోయిన్లు కూడా ఉన్నారు ఈషారెబ్బా.. షామ్నా మాసిమ్ వంటి వారు ప్రధాన పాత్రలో నటించారు. త్వరలోనే ఇది ఆ హలో స్ట్రీమింగ్ అవ్వబోతుందని తెలియజేస్తోంది. హీరోయిన్ పాయల్ సినిమా విషయానికొస్తే.. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాల్లో నటిస్తోంది. ఇక అంతే కాకుండా ఒక గ్యాంగ్స్టర్ బయోపిక్ లో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: