క‌రోనా వైర‌స్ దెబ్బ తో సినిమా రంగం ఎలా అత‌లా కుత‌లం అయ్యిందో మ‌నం రెండేళ్లుగా చూస్తూనే ఉన్నాం. అస‌లు సినిమా లు ఎప్పుడు పూర్త‌వుతా యో?  ఎప్పుడు రిలీజ్ అవుతాయో ?  కూడా ఎవ్వ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. క‌రోనా దెబ్బ తో అగ్ర నిర్మాత‌ల నుంచి, హీరోలు అంద‌రూ విల విల్లాడిపోయారు. సినిమాల మార్కెట్ పూర్తి గా ప‌డిపోయింది. థియేట‌ర్ల చాలా వ‌ర‌కు క‌ళ్యాణ మండ‌పాలు గా మారిపోయా యి. మ‌రో వైపు హీరో ల‌కు రెమ్యున‌రేష‌న్లు త‌గ్గ‌డంతో హీరో స్వామ్యం అనేది కూడా ప‌డిపోయిన ప‌రిస్థితి.

అయితే ఇలాంటి ప‌రిస్థి తుల్లో ఓవ‌ర్సీస్ లో మిగిలిన భాష‌ల సినిమా ల్లాగా తెలుగు సినిమాలూ అక్కడ గట్టి ఎదురు దెబ్బ తిన్నాయ‌నే చెప్పాలి. ఇక అక్క‌డ తెలుగు సినిమాలు ఒక‌ప్పుడు మంచి నీళ్లు తాగిన‌ట్టు గా మిలియ‌న్ మార్క్ సులువుగా క్రాస్ చేసేది. అయితే ఇప్పుడు క‌రోనా పుణ్య‌మా ? అని యూఎస్ లో తెలుగు సినిమాల మార్కెట్ బాగా పడిపోయింది. మళ్లీ పుంజుకోవడానికి చాలా టైం ప‌డుతుంది అనుకుంటోన్న టైంలో అనూహ్యంగా అక్క‌డ తెలుగు సినిమాలు మిగిలిన భాష‌ల సినిమాల క‌న్నా భారీగా వ‌సూళ్లు రాబ‌డుతున్నాయి.

కరోనా బ్రేక్ తర్వాత జాతిరత్నాలు హాఫ్ మిలియన్ మార్కును అందుకున్న సినిమా గా రికార్డుల‌కు ఎక్కింది. ఆ త‌ర్వాత వ‌కీల్‌సాబ్ కూడా అక్క‌డ మిలియ‌న్ డాల‌ర్ల మార్క్‌కు ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. ఇక ల‌వ్ స్టోరీ క‌రోనా త‌ర్వాత అన్ని సినిమాల రికార్డుల‌ను బ్రేక్ చేసింది. ఇక ఇప్పుడు అఖిల్ మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ సినిమా సైతం హాఫ్ మిలియ‌న్ మార్క్ క్రాస్ చేసింది. అఖిల్ రేంజ్ కు ఇది చాలా ఎక్కువ అని అంచ‌నా వేస్తున్నారు. లాంగ్ ర‌న్ లో ఈ సినిమా మ‌రిన్ని వ‌సూళ్లు సాధిస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఏదేమైనా అఖిల్ కు ఇది కెరీర్ ప‌రంగా టాప్ అయ్యింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: