అక్కినేని నట వారసుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హీరోగా పరిచయమయ్యాడు అక్కినేని అఖిల్. ఆయన హీరోగా ఇప్పటి వరకు మూడు సినిమాలు చేయగా అవి కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఎన్నో ఆశలతో మాస్ ప్రేక్షకులను అలరించే విధంగా అఖిల్ అనే సినిమా చేసిన అక్కినేని అఖిల్ ఆ సినిమాతో ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. రెండో సినిమాతో అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చెప్పి క్లాసు దర్శకుడైన విక్రమ్ కుమార్ తో హలో అనే సినిమా చేశాడు.

అది కూడా ప్రేక్షకులను భారీగా నిరాశపరిచింది. ఇక మూడవ ప్రయత్నంగా మిస్టర్ మజ్ను అనే సినిమా చేయగా అది కూడా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యింది. నాలుగవ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకుని విజయవంతం అవ్వాలని భావించాడు. ఈ నేపథ్యంలోనే నాలుగో సినిమాకు సంబంధించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సూపర్ హిట్ కాగా ఆ సినిమాతో తొలి భారీ విజయాన్ని అందుకున్నాడు అక్కినేని అఖిల్. ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి మొత్తం తొలి వారం రోజుల్లోనే వసూలు చేసింది.

దాంతో సక్సెస్ ఫుల్ గా లాభాల్లోకి వెళ్ళిన సినిమా సూపర్ హిట్ సినిమాగా ఇది నిలిచిపోయింది. అయితే ఈ సినిమా తర్వాత అక్కినేని అఖిల్ చేయబోతు న్న ఏజెంట్ సినిమా గతంలో అనుకున్న బడ్జెట్ కంటే ఇంకా తక్కువ బడ్జెట్  అయ్యే విధంగా చేయాలని నిర్మాత దర్శకుడికి సూచించారట. 50 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 60 కోట్లు సాధించాలి. ఇమేజ్ పరంగా అది సాధ్యపడదు కాబట్టి ఇంకో పది కోట్లు తక్కువగానే సినిమా పూర్తి చేయాలని దర్శక నిర్మాత చెప్పాడట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా అఖిల్ కు ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: