మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో తెలుగు సినిమాల్లోకి ప్రవేశించి ఎవరి అండ దండ సహాయ సహకారాలు లేకుండానే నటుడి గా నిలదొక్కుకుని ఇప్పుడు మెగాస్టార్ గా ఎదిగాడు. ఆయన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు మరెన్నో ఫ్లాప్ లు ఎదుర్కొని ఇంకా ఎన్నో కష్టాలు  ఎదుర్కొని ఇప్పుడు ఇంతటి స్థాయి కి ఎదిగాడు. ఏదేమైనా తన మొక్కవోని దీక్షతో సినిమాలు చేస్తూ ఇప్పటివరకు హిట్ సినిమాలతో  ముందుకు పోతూనే ఉన్నాడు చిరు.

అయితే మెగాస్టార్ చిరంజీవి తన జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు రాజకీయ ప్రవేశం చేయడమే అని చాలా సందర్భాల్లో ఆయన కూడా చెప్పారు.  2009వ సంవత్సరంలో ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వెళ్లి ప్రజలకు సేవ చేయాలని భావించారు. అంతకుముందు ఎన్టీఆర్ సినిమా లో వచ్చిన క్రేజ్ తో రాజకీయంగా ఎదిగి ముఖ్యమంత్రి గా ప్రజలకు సేవ చేశారు. అదే విధంగా తనను కూడా జనాలు ఆదరిస్తారని చిరంజీవి పార్టీ పెట్టి పోటీ చేయగా కేవలం 18 సీట్లతో తన పార్టీని ముందుకు తీసుకెళ్ళగాడు.

ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్య సభ సభ్యుడు గా టూరిజం మంత్రిత్వ శాఖ కు మినిస్టర్ గా కూడా కొన్ని సంవత్సరాలు పని చేశాడు. ఆ తర్వాత చిరంజీవి 2018 వ సంవత్సరం వరకు రాజకీయాలలో కొనసాగగా ఎప్పుడూ కూడా సినిమాలను చేయలేకపోయాడు. ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి పొలిటికల్ పరంగా ముందుకు వెళ్లకుండా కేవలం సినిమాలు మాత్రమే చేసుకుంటూ తన పూర్వవైభవాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి రాజకీయాలు అందరికీ కలిసి అన్నట్లుగానే చిరంజీవికి రాజకీయాలు ఏ మాత్రం కూడా కలిసి రాలేదు. ప్రస్తుతం వరుస సినిమా లు చేస్తున్న ఆయన రాజకీయాలకు మళ్లీ వెళ్ళ దలచుకోవట్లేదు. మరి భవిష్యత్ లో ఎలా ఆలోచిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: