ఇప్పుడు సినిమా పరిశ్రమలో యాంకర్ ల పాత్ర కాస్త ఎక్కువగా ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంది యాంకర్లకు సినిమాలో నటించడం అదేవిధంగా కొన్ని కొన్ని విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడం అనేది మన దేశంలో ఎక్కువగా మనం చూస్తూనే ఉన్నాం. వీటి విషయంలో కాస్త విభేదాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. పురుష యాంకర్లు అలాగే మహిళా యాంకర్లు కొంతమంది అతి చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చాలా మంది యాంకర్ లు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడంతో కొంతమంది సినీ నటుల కుటుంబాల్లో కూడా విభేదాలు వస్తున్నాయి అనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి.

ఇక తాజాగా ఒక జాతీయ ఛానల్ లో చేసే ఒక కార్యక్రమంలో ఒక యాంకర్ కారణంగా ఒక ప్రముఖ బాలీవుడ్ హీరో కుటుంబంలో విభేదాలు వచ్చాయని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. హీరో సినిమాలో నటిస్తున్న సదరు యాంకర్ విషయంలో కుటుంబ సభ్యులు చాలా సీరియస్ గా ఉన్నారని సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా హీరోతో ఆమె మాట్లాడటానికి వెళ్తుందని అలాగే ఇద్దరూ కలిసి వ్యాపారాలు కూడా చేస్తున్నారని దీనితో హీరో భార్య చాలా సీరియస్ గా ఉందని అంటున్నారు. అదేవిధంగా కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి సదరు యాంకర్ ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో ఇప్పటికే హీరో కుటుంబ సభ్యులు వార్నింగ్ కూడా ఇచ్చారని సమాచారం.

యాంకర్ ఇప్పుడు ఆ హీరో ద్వారా తన పరిచయాలు పెంచుకోవడమే కాకుండా సినిమాల్లో అవకాశాల కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఆ హీరోని తన చెప్పుచేతల్లో ఉంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనే దానిపై క్లారిటీ లేకపోయినా దీనికి సంబంధించి మాత్రం ఇప్పుడూ హీరో కుటుంబం చాలా సీరియస్ గా ఉందని యాంకర్ ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ఆమెపై కేసు పెడతామని కూడా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: