టాలీవుడ్ లో సీనియర్ హీరో మోహన్ బాబు కు తిరుగు లేదన్న విషయం తెలిసిందే. ఆయన చేసిన సినిమాలు, ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ మోహన్ బాబు ను టాలీవుడ్ కు కలెక్షన్ కింగ్ లా చేశాయి. అట్లా సినిమాల్లో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న సమయంలోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు మోహన్ బాబు. దివంగత ఎన్టీ రామారావు సన్నిహితుడిగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న మోహన్ బాబు టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. అలాగే ఎన్టీ రామారావు ఆశీర్వాదాలతో అప్పట్లో ఆయన నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ లో 1982లో చేరారు. అలా ఎన్టీఆర్ చలవతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మోహన్ బాబు 1995లో ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆరు సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యుడిగా రాజ్య సభలో కొనసాగిన మోహన్ బాబు చిత్తూరు జిల్లాలో అభివృద్ధి చేయడానికి తన వంతు సహాయ సహకారాలు అందించారు. అప్పట్లో ఆయన అక్కడ రోడ్లు వేయడం నుంచి స్వచ్ఛమైన నీటిని అందించడం పారిశుద్ధ్యం పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టారు. 1996 నుండి 1997 వరకు మానవ వనరుల అభివృద్ధి కమిటీ, పట్టణ, గ్రామాభివృద్ధి కమిటీ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ లో కూడా సభ్యుడిగా ఉన్నాడు. సోషల్ ఫారెస్ట్రీ ఈ కార్యక్రమంలో భాగంగా వన రక్షణ సమితి సహాయంతో చాలా గ్రామాల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టాడు. గ్రామీణ ప్రజల కోసం ఆరోగ్యం పోషకాహారం విద్య పై పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఆ తర్వాత ఆయన టిడిపిని వీడి సినీ పరిశ్రమలో కెరీర్ ను కొనసాగించారు. ఎన్టీఆర్ చనిపోయాక టీడీపీకి దూరమైన మోహన్ బాబు తరువాత కాలంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వైసీపీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: