మన తెలుగులో యాంకర్ల హడావుడి అంతా ఇంతా కాదు. చాలా మంది యాంకర్ లు ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా మీద కూడా ఎక్కువగానే ప్రభావం చూపిస్తున్నారు. తెలుగు సినిమాల్లో నటించడానికి కొంతమంది యాంకర్లు స్టార్ హీరోలతో అదే విధంగా కొంతమంది నిర్మాతలతో అలాగే కొంత మంది దర్శకులతో కూడా ఎక్కువగా స్నేహం చేయడం ఈ మధ్యకాలంలో బాగా సంచలనం అవుతున్న విషయం గా మనం చెప్పుకోవాలి. యాంకర్ల వ్యవహారం రానురాను కాస్త సీరియస్ గా మారే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఎక్కువగానే జరుగుతుంది.

ఇప్పుడు ఇదిలా ఉంటే తెలుగు సినిమా లో కొంతమంది యాంకర్లు నటించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే యాంకర్ల మధ్య విభేదాలు కూడా వస్తున్నాయని అంటున్నారు. కొంతమంది యాంకర్లు ఈ మధ్యకాలంలో దర్శకులతో స్నేహం చేస్తూ వారి వారి సినిమాల్లో నటించడం అదేవిధంగా ఐటమ్ సాంగ్స్ చేసేందుకు ప్రయత్నాలు చేయడం వంటివి జరుగుతూ వస్తున్నాయి. అందుకే ఈ మధ్య ఒక యాంకర్ ఒక సినిమాలో నటించేందుకు అలాగే ఐటమ్ సాంగ్ చేసేందుకు దర్శకుడు తో చర్చలు జరపడం మరో యాంకర్ ఈ విషయంలో సీరియస్ అయింది అని కూడా అంటున్నారు.

సదరు సినిమా కోసం తాను ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు అని కానీ ఇప్పుడు ఆ యాంకర్ ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని స్టార్ హీరో రికమెండ్ చేస్తున్నా సరే... ఆ యాంకర్ ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని కొంతమంది వద్ద ఆమె వాపోయింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక సీనియర్ యాంకర్ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరితే ప్రయత్నం చేస్తుందని అలాగే ఒక ఛానల్ యాజమాన్యం కూడా వీరిద్దరితో చర్చ జరుపుతుందని అంటున్నారు. గతంలో కూడా ఇటువంటి విభేదాలు టాలీవుడ్ లో వచ్చినట్టుగా మనం వార్తలు కూడా చూశాం.

మరింత సమాచారం తెలుసుకోండి: