టాలీవుడ్ టాప్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి అగ్ర హీరోల సరసన నటించి టాలీవుడ్లో చాలాకాలం పాటు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ఈ భామ. ఇప్పటికీ వరుస సినిమాలతో తన హవాను కొనసాగిస్తోంది. వీటితోపాటు టాక్ షోలు వెబ్ సిరీస్ లతో క్షణం తీరికలేకుండా గడుపుతోంది తమన్నా. ఇక ప్రస్తుతం తమన్నా వయస్సు 31 సంవత్సరాలు. అయినా కూడా ఈమె అసలు పెళ్లి ఊసే ఎత్తడం లేదు. కానీ అభిమానులు మాత్రం తమన్నా పెళ్లి ఎప్పుడు ఎప్పుడు చేసుకుంటుందని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

 ఇక ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. తమన్నా గతంలో తమిళ స్టార్ హీరో కార్తి తో ప్రేమాయణం నడిపింది అంటూ వార్తలు ప్రసారం అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వీరిద్దరు జంటగా నటించిన 'ఆవారా' సినిమా విడుదల సమయంలో తమన్నా, కార్తీ చేసిన హడావిడి.. అలాగే వీరి మధ్య ఉన్న అతి చనువు చూసి అప్పట్లో ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ వార్తలు ప్రచారం అయ్యాయి. అంతేకాదు ఈ ఇద్దరు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కట్ చేస్తే కార్తీకి అతని తండ్రి వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేశాడు. దాంతో తమన్నాను కోడలిగా చేసుకోవడం కార్తీ తండ్రికి ఇష్టం లేదని..


 అందుకే అతని తండ్రి వీరి పెళ్లికి అంగీకరించలేదని.. అందుకే వీరిద్దరి ప్రేమ విఫలం అయిందని అప్పట్లో గట్టిగా ప్రచారం జరిగింది. అయితే కొంతమంది ఈ వార్తలను కొట్టి పారేస్తే.. మరికొంతమంది మాత్రం ఇది నిజమే అనుకున్నారు. మరి నిజంగా ఈ ఇద్దరూ ప్రేమించుకొని విడిపోయారా? అనేది ఆ ఇద్దరికే తెలియాలి. ఇక 'ఆవారా' సినిమా తర్వాత ఈ ఇద్దరు 'ఊపిరి' సినిమాలో కలిసి నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున మరో హీరోగా నటించగా.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: