బాలీవుడ్ బాద్షా షార‌క్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అవ్వ‌డంతో మ‌రోసారి బాలీవుడ్ లో డ్ర‌గ్స్ ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయి. ఆర్య‌న్ ఖాన్ ను అరెస్ట్ చేసిన ఎన్సీబీ అధికారులు నింధితుడుగా ఆర్య‌న్ ఖాన్ ను ఇప్ట‌టికీ ప్ర‌క‌టించ‌లేదు. ఇక నిన్న ఆర్య‌ణ్ ఖాన్ ను క‌లిసేందుకు షారుఖ్ వెళ్ల‌గా అక్క‌డ ఇద్ద‌రూ భావోద్వేగానికి లోనైన‌ట్టు తెలుస్తోంది. అర‌గంట పాటు ఆర్య‌న్ ఖాన్ ముందు షారుఖ్ కూర్చుని ఉండ‌గా అన్నం తింటున్నావా అని అడిగితే జైలు ఫుడ్ భాగోలేద‌ని ఆర్య‌న్ స‌మాధానం ఇచ్చార‌ట‌. దాంతో షారుక్ ఖాన్ ఇంటి నుండి ఆహారం పంపించ‌వ‌చ్చా అని జైలు అధికారుల‌ను ప్ర‌శ్నించ‌గా....దానికి కోర్టు అనుమ‌తి తీసుకోవాల‌ని స‌మాధానం ఇచ్చారట‌. ఇక ఆర్య‌న్ ఖాన్ ముందు బ్లాక్ గ్లాసెస్ పెట్టుకున్న షారుక్ కంట‌త‌డి పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. 

డాడీ స్వారీ డాడీ అంటూ ఆర్య‌న్ ఖాన్ చాలా సేపు ఏడ్చార‌ట‌. ఇంట‌ర్ కామ్ లో మాట్టాడుతున్న ఆర్య‌న్ షారుక్ లు ఒక‌రిని చూస్తూ మ‌రొక‌రు ఎమోష‌న‌ల్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ న‌టి అన‌న్య పాండేకు కూడా ఎన్సీబీ నోటీసులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా అన‌న్య  ఫోన్ మ‌రియు లాబ్ టాప్ ల‌ను కూడా ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్య‌న్ ఖాన్ గ‌ర్ల్ ఫ్రెండ్ అన‌న్య పాండే కావ‌డం..ఆమెతో ఆర్య‌న్ డ్ర‌గ్స్ గురించి మెసేజ్ లు చేసాడ‌న్న కార‌ణంగానే అనన్య ఇంటికి ఎన్సీబీ అధికారులు చేరుకుని సోదాలు చేసి అనంత‌రం ఆమెను విచార‌ణ జ‌రిపారు.

ఇదిలా ఉంటే డ్ర‌గ్స్ వ్య‌వహారం ఇండ‌స్ట్రీలో కొత్తేమీ కాద‌ని కానీ షారుక్ ఖాన్ వ్య‌వ‌హారంలో మాత్రం ఎన్సీబీ దూకుడుగా వ్య‌వ‌హరిస్తోంది అన్న ఆరోప‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి. బాలీవుడ్ లో ఏదో జ‌రుగుతోందని...బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఎవ‌రికో టార్గెట్ అయ్యార‌న్న ఆరోప‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి. ఆర్య‌న్ ఖాన్ బెయిల్ కోసం ధ‌రకాస్తులు చేసుకోవ‌డం...బెయిల్ కు కోర్టులు నిరాక‌రించ‌డంతో షారుక్ ఖాన్ నే ఎవైరైనా టార్గెట్ చేశారా అన్న అనుమానాలు వస్తున్నాయని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: