తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి తార జయప్రద గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. జయప్రద వ్యక్తిగత విషయాలకు వెళ్తే.. 1962 ఏప్రిల్ 3న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబములో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించారు. ఆమెకి చిన్నప్పటి నుండి డాక్టర్ కావాలనే కోరిక ఉండేదంట. అయితే ఆమె తల్లి ఏడేళ్ల వయస్సు నుండే నాట్య సంగీత శిక్షణకు పంపించారంట.

ఇక జయప్రద తండ్రి, బాబాయిలు సినిమా పెట్టుబడిదారులైనప్పటికీ ఈమెకు సినీరంగ ప్రవేశము వారిద్వారా లభించలేదు. అయితే 14 ఏళ్ల వయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం.ప్రభాకరరెడ్డి ఈమెను చూసి ఈమెకు జయప్రద అని నామకరణము చేశారంట. కాగా.. 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో మూడు నిమిషాలు నిడివికల ఒక పాట ద్వారా ఈమెను చిత్రసీమకు పరిచయం చేశారు.

ఇండస్ట్రీకి ఆలా అడుగుపెట్టిన జయప్రద  2005 వరకు మూడు దశాబ్దాలలో ఆరు భాషలలో నటించారు. ఆమె 300కు పైగా సినిమాలలో నటించారు. జయప్రద 1986 జూన్ 22 న సినీనిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహం చేసుకున్నారు. ఆమె సినిమాలో నటిస్తూనే మరోవైపు రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారు. ఆమె సినీయర్ ఎన్టీఆర్ ఆహ్వానముతో మొదటిసారిగా టీడీపీలో రాజకీయరంగ ప్రవేశము చేశారు. ఆ తరువాత ఆమె చంద్రబాబు నాయుడు పక్షములో చేరి టీడీపీ మహిళా విభాగమునకు అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహించారు.

ఇక 1996లో టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైయ్యారు. అయితే ఆ తరువాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవల వలన ఆమె టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం జయప్రద ములాయం సింగ్ యాదవ్ స్థాపించిన సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆమె ‘ఆంధ్ర నా జన్మ భూమి కానీ ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి’ అనే నినాదంతో ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్ నియోజవర్గం నుంచి 2004లో లోక్ సభకు ఎన్నికయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: