తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి స్టార్ హీరోయిన్స్ లో జయసుధ ఒక్కరు. ఆమె తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ సహజ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. జయసుధ అసలు విషయానికి వస్తే.. ఆమె అసలు పేరు సుజాత. జయసుధ 1959 డిసెంబర్ 17న మద్రాస్ లో జన్మించారు. ఆమె పుట్టి పెరిగినది మద్రాసులో అయినా తన మాతృభాష మాత్రం తెలుగు.

టాలీవూడ్ లెజెండరీ లేడీ డైరెక్టర్ నటి విజయనిర్మల జయసుధకి మేనత్త అవుతుంది. ఆమె 1985లో హిందీ నటుడు జితేంద్రకు దాయాది అయిన నితిన్ కపూర్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో ఆమె భర్త ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం అందరికి తెల్సిందే.

జయసుధ 1972లో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన పండంటి కాపురం సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైయ్యారు. ఆమె తెలుగులోనే కాకుండా పలు భాషలలో కూడా నటించారు. ఇక జయసుధ నటించిన 300లకు పైగా సినిమాల్లో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమాలో నటించారు. అయితే రాఘవేంద్రరావు దర్శకత్వంలో సుమారు 25 సినిమాలు చేయగా, దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాల్లో నటించారు ఆమె. అంతేకాదు.. ఒకే సంవత్సరంలో జయసుధ నటించిన సినిమాలు 25 విడుదలైయ్యాయి.

అయితే 2001లో జయసుధ బాప్తిస్మము పుచ్చుకొని క్రైస్తవ మాతని స్వీకరించారు. ఇక ఇటీవల అనారోగ్యముతో బాధపడుతూ వైద్య సహాయములేని పిల్లలకు సహాయము చెయ్యడానికి ఈమె ఒక ట్రస్టును కూడా ప్రారంభించింది జయసుధ. అయితే 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాదు ఎమ్.ఎల్.ఏగా గెలిచి తన రాజకీయ ప్రస్తావని మొదలు పెట్టింది. జయసుధ వెండితెరపై హీరోయిన్ గా కనిపించి ఆ తరువాత అక్కగా, వదినగా, పిన్నిగా పలు సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆమె వెండితెరపై అమ్మగా, భామగా సినిమాలో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: