ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5  ఆరు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆరు వారాలకు గానూ ఆరుగురు సభ్యులు ఎలిమినేట్ అయిపోయారు. అందులో ఐదుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఎలిమినేట్ అయ్యారు. సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీద, శ్వేత ఇలా వరుసగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఉత్కంఠ భరితంగా మారింది. ఇక ఈ వారం లోబో, సిరి, ఆనీ మాస్టర్ డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిలో ఆనీ మాస్టర్ ని సేవ్ చేయాలి అనుకుంటే లోబో, సిరి ఈ ఇద్దరిలో ఒకరిని కచ్చితంగా బయటికి పంపియాలి.

 ఒకవేళ లోబోని ఎలిమినేట్ చేస్తే.. లోబో సీక్రెట్ రూమ్ కి వెళ్లి వచ్చినా ఏం ప్రయోజనం ఉండదు. మరోవైపు లోబో గేమ్ పట్ల కూడా అంతగా ఆసక్తి చూపుతున్నట్లు కనిపించడం లేదు. ఇక సిరిని ఎలిమినేట్ చేస్తే మాత్రం ముగ్గురు మోజ్ రూమ్ బ్యాచ్ లో కచ్చితంగా ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు  అప్పుడు సిరి వెళ్ళిపోతే షణ్ముక్, జెస్సిల గేమ్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరం గా ఉంటుంది. ఇక కొన్ని ఇన్ ఆఫీషియల్ వెబ్సైట్ లలో ఓటింగ్ విధానం ద్వారా చూస్తే.. ఈ వారం కచ్చితంగా లోబో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదటి వారం నుంచి తనదైన స్టైల్ లో గేమ్ ఆడిన లోబో..

ఆ తర్వాత మెల్లమెల్లగా రవి మరియు విశ్వ మాటలకి ప్రభావితం అయిపోయాడు. తనకంటూ ఒక ప్రత్యేక గేమ్ ని ఆడ లేక విఫలమయ్యాడు అందుకే ఈసారి లో బోని ఈ వారంలో బిగ్ బాస్ ఎలిమినేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆని మాస్టర్ సిరి ఇద్దరు కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు ఈ ఇద్దరిలో సిరి సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఆనీ మాస్టర్ విషయానికొస్తే.. ఈమెకు కూడా ఓటింగ్ తక్కువ శాతం వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి ఆనీ మాస్టర్ ని కూడా ఎలిమినేట్ చేసిన  ఆశ్చర్యపోనక్కర్లేదు చూడాలి మరి ఈ వారానికి ఎవరు ఎలిమినేట్ అవుతారో...!!

మరింత సమాచారం తెలుసుకోండి: