సూప‌ర్ స్టార్ మహేష్ బాబు, మోస్ట్ స‌క్స్ స్ ఫుల్ బ్యూటీ కీర్తి సురేష్ హీరో హీరోయిన్ లు గా వస్తున్న చిత్రం స‌ర్కార్ వారి పాట షూటింగ్ ను త్వ‌ర‌లో పూర్తి చేసుకోవ‌డానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా కు టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ పరుశురామ్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా ను సంక్రాంతి బ‌రి లో ఉండ బోతుంది. అయితే ఈ సినిమా త‌ర్వాత టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ డైరెక్ష‌న్ లో మ‌రో సినిమా ను ప్లాన్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా ఇప్ప‌టికే వ‌చ్చింది. వీరి కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఈ సినిమా కథ అద్భుతంగా ఉంద‌ని స‌మాచారం. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టడం ఖాయ‌మ‌ని తెలుస్తుంది.అయితే ఈ సినిమా కు సంబంధించి మ‌రొక్క వార్త అటు సోష‌ల్ మీడియా లో, ఇటు తెలుగు  సినిమా ప‌రిశ్ర‌మ‌లో చక్క‌ర్లు కొడుతుంది. అది ఎంటి అంటే ఈ సినిమా లో రెండో హీరోయిన్ గా ప్ర‌ముఖ మోడ‌ల్ మిస్ ఇండియా మీనాక్షి చౌద‌రి న‌టిస్తుంద‌ని. దీని కోసం మీనాక్షి చౌద‌రి తో డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఇప్ప‌టికే సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమా లో మీనాక్షి చౌద‌రి కూడా న‌టించ‌డానికి ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం. అయితే ఈ వార్త ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. మీనాక్షి చౌద‌రి ఇప్ప‌టికే టాలీవుడ్ లో ఇచ్చ‌ట వాహానాలు నిల‌ప‌రాదు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అలాగే ప్ర‌స్తుతం మాస్ మ‌హారాజ రవితేజ తో ఖీలాడి సినిమాలో నటిస్తుంది. అయితే ఈ సినిమా లో ఇప్ప‌టికే మొద‌టి హీరోయిన్ గా పాత్ర కు బ్యూటీ ఫుల్ హీరోయిన్ పూజా హెగ్డె ను ఎంచు కున్నారు.  
మరింత సమాచారం తెలుసుకోండి: