IHG
సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సినిమాలో ప్రధాన పాత్రదారుడు డమ్మీ గన్ (ప్రాప్) ఫైర్ చేయడం తో ఆ సినిమాకు పనిచేసే మహిళా సినిమాటో గ్రాఫర్ , ఆ చిత్ర దర్శకుడు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటనలో మహిళా సినిమాటోగ్రాఫర్ అక్కడికక్కడే చనిపోయారు హాస్పిటల్ కి తీసుకువెళ్లినా కూడా లాభం లేక పోయింది. ఆ సినిమా దర్శకుడికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. అమెరికా నటుడు అలెక్ బాల్డ్ విన్ నటిస్తున్న హాలీవుడ్ చిత్రం ‘రస్ట్’ అనే సినిమాకోసం ఓ డమ్మీ గన్ ను వాడవలసి వచ్చింది అయితే ఆ సీన్ లో గన్ ఫైర్ చేసినప్పుడు పక్కనే ఉన్న మహిళా సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్ అక్కడికక్కడే మరణించారు. ఆమెను హెలికాఫ్టర్ సహాయం తో హాస్పిటల్ కి తీసుకువెళ్లినా కూడా ఉపయోగం లేకపోయింది.

IHG


IHG


 ఐతే ఇదే ఘటనలో డైరెక్టర్ జోయల్ సౌజా తీవ్రంగా గాయపడ్డాడు. మాములుగా మూవీ షూటింగ్ సన్నివేశాల్లో డమ్మీ తుపాకులని వినియోగిస్తారు. వాటితో అరుదుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఈ ' రస్ట్'  సినిమా కోసం డమ్మీ తుపాకిని ట్రంప్ పాత్రదారుడు  అలెక్ బాల్డ్ విన్  వాడారు. దింతో డమ్మీ గన్ తోకూడా మనుషులు చనిపోతారా అని అందరిలో సందేహం కలుగుతోంది. అవును వాటివల్ల ప్రమాదాలు జరుగుతాయని ఒక్కో సరి ప్రాణాపాయ స్థితికి కూడా వెళతారని తెలుస్తోంది. ఎంటర్ టైన్మెంట్ కోసం వాడే ఏ మారణాయుదాన్నైనా   ' ప్రాప్ ' ఆయుధాలు అని పిలుస్తారు . వీటిని షూటింగ్ లకు మాత్రమే వాడుతుంటారు. వాటి పనితనం వాళ్ళకు వాటితో ఎటువంటి ప్రమాదం ఉండదని అందరూ అనుకుంటారు. కేవలం అవి తుపాకుల్లా కనిపించే వస్తువుల్లా అందరు అనుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో నిజమైన తుపాకుల్లా వాడుతుంటారు.




 నిజమైనవి గా కనిపించేందుకు కేవలం క్లోసప్ షాట్స్ కోసమే వాటిని ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఆ తుపాకులాని ఆపరేట్ చేయడానికి పక్కనే ఓ నిపుణిడిని వుంచవలసి ఉంటుంది. సరైన పద్దతులలో గన్ ను వాడుతున్నారా లేదా అనేకోణం చెక్ చేసుకోవాలి. అదేవిధంగా తుపాకీతో పనిచేసేటప్పుడు కాట్రిడ్జ్ ను లోడ్ చేయకుండా డమ్మీ కాట్రిడ్జ్ ను ను లోడ్ చేస్తారు. అదేవిధంగా కేసింగ్ , ఫైరింగ్ పిన్ , గన్ పౌడర్ లను కూడా లోడ్ చేస్తారు . ఫైరింగ్ సమయంలో పెద్ద శబ్దం తో తుపాకీ పెళ్లి గన్ పౌడర్ పెద్ద శబ్దం తో బయటకు వస్తుంది. అయితే ఈ ఘటన లో నటుడు  అలెక్ బాల్డ్ విన్  పై ఎటువంటి కేసు నమోదు చేయబడలేదు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: