టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ rrr విడుదలకు సిద్ధమవుతున్న సంగతి అందరికి తెలిసిందే.

గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోందని ఎవరిని అడిగిన చెబుతారు.. ఇక ఈ దసరా సందర్భంగా విడుదల అవుతుంది అనుకునే లోపే అనుకోకుండా సినిమా మళ్లీ వాయిదా పడిందని సమాచారం. ఇక మొత్తానికి ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రణాళికలు రచిస్తోందని సమాచారం.. ఇప్పటికే అఫీషియల్ గా విడుదల తేదీ పై క్లారిటీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. దీపావళి సందర్భంగా రెగ్యులర్ ప్రమోషన్ కూడా మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. దీపావళి రోజున అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఒక బిగ్ బ్లాస్ట్ లాంటి సర్‌ప్రైజ్‌ చేస్తున్నట్లు సమాచారం.

 
జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించగా రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఇరగదీసారని తెలుస్తుంది.రెండు పాత్రలతోనే కాకుండా దర్శకుడు రాజమౌళి అజయ్ దేవగన్ తో మరొక పవర్ఫుల్ పాత్ర చేయించారని సినిమాలో ప్రతి చిన్న పాత్ర కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది అని రచయిత విజయేంద్రప్రసాద్ కూడా ఇది వరకే ఒక వివరణ ఇచ్చారని తెలుస్తుంది. మల్టీస్టారర్ ప్రేక్షకులకు ఈ సినిమా ఒక ఫుల్ మీల్స్ అనేలా ఉంటుంది అని ఒక క్లారిటీ అయితే వచ్చేసిందని తెలుస్తుంది.

ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్..
సినిమాకు సంబంధించిన పోస్టర్స్ టీజర్స్ కూడా ఇప్పటికే సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయని తెలుస్తుంది.గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాను 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయ్యాయని తెలుస్తుంది.. చిత్ర యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారని సమాచారం.


ఇక వీలైనంత త్వరగా సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్ స్టార్ట్ చేయాలని దర్శకుడు రాజమౌళి గత కొన్ని వారాలుగా చిత్ర యూనిట్ తో చర్చలు జరుపుతున్నాడని తెలుస్తుంది.ఇక ఈ దీపావళి కి ఒక ప్రత్యేకమైన ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.ఆ రోజు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఒక అద్భుతమైన టీజర్ ను విడుదల చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.గతంలో బాహుబలి ప్రమోషన్ విషయంలో ఎలాంటి ఫార్ములాను అయితే సక్సెస్ చేశారో ఇప్పుడు కూడా అదే తరహాలో ముందుకు వెళ్లాలని చూస్తున్నట్లు సమాచారం.
 

సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా హైలెట్ అయ్యేలా ఉండాలని దర్శకుడు రాజమౌళి ప్రణాళికలు రచిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన మొదటి పాటకు భారీ స్థాయిలో స్పందన లభించిందని రాబోయే టీజర్ కూడా అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రాజమౌళి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తొమ్మిది వందల కోట్లకు పైగా జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.సినిమా బాక్సాఫీస్ వద్ద మొత్తం స్థాయిలో లాభాలు అందిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: